VZM: మొంథా తుఫాన్ కారణంగా ఎస్.కోట పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో పలు లోతట్టు ప్రాంతాలు, కొండవాలు ప్రాంతాలలో వర్షం నీరు రోడ్డుమీద భారీగా ప్రవహిస్తుంది. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ఇళ్ళలోకి వర్షం నీరు చేరడంతో కూలిపోయే స్థితికి చేరడంతో పోలీసులు దగ్గర ఉండి పునరావాస కేంద్రాలకు తరలించారు. అనంతరం వర్షం నీటిలోకి వెళ్లవద్దని పోలీసులు హెచ్చరించారు.