ప్రకాశం: మొంథా తుఫాన్ కారణంగా ఒంగోలులోని ఆంధ్ర కేసరి యూనివర్సిటీ పరిధిలోని అక్టోబర్ 31 నుంచి నవంబర్ 7 వరకు జరగాల్సిన గ్రాడ్యుయేట్ (UG) 3, 5వ సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. దీంతో వీటిని తిరిగి నవంబర్ 10 నుంచి 17 వరకు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొ. డీవీఆర్ మూర్తి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.