MDK: తూప్రాన్ పట్టణ శివారు అయ్యప్ప ఆలయం నుంచి శ్రీ శబరి గిరీష మహా పాదయాత్ర సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప మాల ధారణ స్వాములు శబరిమలకు మహా పాదయాత్ర చేపట్టారు. అయ్యప్ప ఆలయంలో ఇరుముడి కార్యక్రమం ముగించి పాదయాత్రగా శబరిమల బయలుదేరి వెళ్లారు. ఉప్పల శ్రీకాంత్, కనకరాజు, శివ గౌడ్, మామిండ్ల యాదగిరి, కొండల్ యాదవ్, సాయి, గణేష్ పాదయాత్రగా తరలి వెళ్లారు.