NLG: మొంథా తుఫాను కారణంగా మండలంలోని పలు గ్రామాల్లో నేలకొరిగిన, నీట మునిగిన పొలాలను సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి గురువారం పరిశీలించారు. సీపీఎం బృందం, రైతులతో కలిసి ఆయన మాట్లాడుతూ.. తుఫాను వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి అని, తగిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.