GNTR: ‘మొంథా’ తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాల అనంతరం రైతులు తీసుకోవాల్సిన పంటల యాజమాన్య చర్యలపై అవగాహన కల్పించేందుకు మండల వ్యవసాయ అధికారి జే.వాసంతి ఇవాళ మేరికపూడి, నుదురుపాడు ఫిరంగిపురం ప్రాంతాల పంట పొలాలను సందర్శించారు. అనంతరం ఫిరంగిపురంలో నిర్వహించిన కార్యక్రమంలో రైతులకు పలు సూచనలు చేశారు.