‘బాహుబలి: ది ఎపిక్’ రేపు రీ-రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ థియేటర్లలో స్పెషల్ సర్ప్రైజ్ ఉందని రాజమౌళి చెప్పారు. దీని ఇంటర్వెల్లో ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ 3D యానిమేషన్ టీజర్ ప్రదర్శించనున్నట్లు తెలిపారు. బాహుబలి 3 ఉండదని, బాహుబలి యూనివర్స్ కొనసాగనుందని పేర్కొన్నారు. ఈ యానిమేషన్ సీక్వెన్స్ ఇషాన్ శుక్లా తెరకెక్కించినట్లు చెప్పారు.