»Notification Released For Recruit Of Tspsc Chairman And Members
TSPSC : టీఎస్పీఎస్సీ సభ్యుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
టీఎస్పీఎస్సీలో ఖాళీగా ఉన్న చైర్మన్, సభ్యుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 18లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత గల అభ్యర్థులు www.telangana.gov.in వెబ్సైట్ నుండి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
TSPSC : టీఎస్పీఎస్సీలో ఖాళీగా ఉన్న చైర్మన్, సభ్యుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 18లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత గల అభ్యర్థులు www.telangana.gov.in వెబ్సైట్ నుండి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ దరఖాస్తులను ఈ నెల 18 సాయంత్రం 5 గంటల లోపు secy-ser-gad@telangana.gov.inకు పంపవచ్చు. చైర్మన్, సభ్యుల పోస్టులకు సంబంధించిన విద్యార్హతలు, ఇతర వివరాలను ఈ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చునని TSPSC తెలిపింది.
టీఎస్పీఎస్సీ సభ్యురాలు సుమిత్రా ఆనంద్ తనోబా ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వం మారడం.. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో కలత చెందిన ఆమె శుక్రవారం తన రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపారు. కొందరు వ్యక్తుల కారణంగా వ్యవస్థ పై మచ్చ పడిందని.. తమ ప్రమేయం లేదని.. అయినా కమిషన్ ను మారుస్తారన్న ప్రచారం బాధించిందని సుమిత్రానంద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ నామ సంవత్సరం అనుకున్న సంవత్సరమే ఎన్నికల సంవత్సరం కావడం వల్ల తాము ఉద్యోగ నియామక ప్రక్రియను సజావుగా జరపలేకపోయామని సుమిత్రానంద్ బాధను వ్యక్తం చేశారు.
టీఎస్పీఎస్సీ చైర్మన్ డాక్టర్ బీ జనార్దన్‌రెడ్డి, సభ్యులు బండి లింగారెడ్డి, ఆర్ సత్యనారాయణ, కారం రవీందర్‌రెడ్డి ఇప్పటికే రాజీనామాలు సమర్పించారు. తాజాగా వీరి రాజీనామాలను గవర్నర్ ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న సుమిత్రా ఆనంద్ తనోబా శుక్రవారం టీఎస్పీఎస్సీ కార్యాలయానికి చేరుకుని తమ సిబ్బంది ద్వారా గవర్నర్‌కు రాజీనామా లేఖ పంపారు. ప్రస్తుతం కమిషన్‌లో కోట్ల అరుణకుమారి మాత్రమే సభ్యులుగా ఉన్నారు.