»Warner Landed On The Ground By Helicopter Directly For The Big Bash T20 League Match
Warner: మ్యాచ్ కోసం నేరుగా హెలికాప్టర్‌తో గ్రౌండ్లో దిగిన వార్నర్
ఇటీవల వన్టేలకు, టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రస్తుతం టీ20 లు ఆడుతున్నారు. తాజాగా ఆయన ఓ మ్యాచ్ కోసం గ్రౌండ్లో హెలికాప్టర్‌తో దిగారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.
Warner landed on the ground by helicopter directly for the Big Bash T20 league match
Warner: ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్(Warner) ఆస్ట్రేలియాలో బిగ్ బాష్ టీ20 లీగ్(T20 league match) జరుగుతుండగా నేరుగా హెలికాప్టర్లో స్టేడియంలో దిగాడు. వార్నర్ బిగ్ బాష్ లీగ్ లో సిడ్నీ థండర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈరోజు సిడ్నీ థండర్ జట్టు-సిడ్నీ సిక్సర్స్ మ్యాచ్ ఉంది. అదే సమయంలో వార్నర్ తన సోదరుడి పెళ్లి కోసం ఉదయాన్నే హంటర్ వ్యాలీకి వెళ్లీ తిరిగి మ్యాచ్ కోసం హెలికాప్టర్లో సిడ్నీ బయల్దేరాడు. అలా నేరుగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్ సీజీ)లో దిగడంతో అందరూ ఆశ్చర్యపోయారు. హెలికాప్టర్ నుంచి దిగిన వార్నర్ వెంటనే నెట్ ప్రాక్టీసుకు వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సిడ్నీ సిక్సర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 151 పరుగులు చేసింది. థండర్ జట్టు 19.5 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్ గా దిగిన వార్నన్ 39 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులతో 37 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఇటీవల వన్టేలకు, టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రస్తుతం టీ20 లు ఆడుతున్నారు.