»Sajjala Ramakrishna Reddy Chandrababus Conspiracy Behind Sharmila Joining Congress
Sajjala Ramakrishna Reddy: షర్మిల కాంగ్రెస్‌లో చేరడం వెనుక చంద్రబాబు కుట్ర
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పార్టీని విలీనం చేసి కాంగ్రెస్‌లో చేరడంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. షర్మిల చేరడం వెనుక కుట్ర ఉందని సజ్జల ఆరోపించారు.
Sajjala Ramakrishna Reddy: వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరడం వెనుక చంద్రబాబు కుట్ర ఉందని ఆరోపించారు. రాజకీయంగా షర్మిల ఎక్కడి నుంచైనా ప్రాతినిథ్యం వహించవచ్చని తెలిపారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి అసలు భవిష్యత్తే లేదన్నారు. తాము కాంగ్రెస్ పార్టీని పట్టించుకోబోమని తెలిపారు. షర్మిల వల్ల వైసీపీకి ఆంధ్రప్రదేశ్‌కు నష్టం ఏం లేదని తెలిపారు.
చంద్రబాబుకి ఏం కావాలో కుట్ర ప్రకారం మిగతా వాళ్లను కలుపుకుని అందరితో కలిసి చేయిస్తాడని, సంక్షేమం పేరుతో చంద్రబాబు ప్రజల్లోకి వెళ్తే చంద్రబాబుకి మైనస్ మార్కులు వస్తాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో చంద్రబాబు ఎప్పటినుంచో కాంటాక్ట్‌లో ఉంటున్నాడన్నారు. సీఎం జగన్‌కు కుటుంబం కంటే ప్రజలే ముఖ్యమని సజ్జల స్పష్టం చేశారు. కుటుంబం కోసం జగన్ పార్టీ పెట్టలేదని.. తమ విధానాలు తమకు ఉన్నాయని తెలిపారు. పార్టీని వీడటానికి కారణం వాళ్లే చెప్పారన్నారు.