»Avinash Reddys Cbi Investigation Concluded Court Inquired About Whatsapp Calls
Avinash Reddy To CBI : ముగిసిన అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ..వాట్సాప్ కాల్స్‌పై ఆరా తీసిన కోర్టు
అవినాష్(Avinash Reddy)కు షరతులతో కూడి బెయిల్‌ను ధర్మాసనం ఇచ్చింది. ప్రతి శనివారం సీబీఐ విచారణకు ఆయన కచ్చితంగా హాజరుకావాలని ఆదేశించింది. అనుమతి లేకుండా దేశం విడిచి పెట్టి వెళ్లరాదని పలు సూచనలు చేసిన సంగతి తెలిసిందే.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు(Ys Viveka Murder case)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి(Avinash Reddy) శనివారం సీబీఐ కోర్టు(CBI Court) విచారణకు హాజరయ్యారు. ఉదయం 10 గంటల నుంచి సీబీఐ ఆఫీసులో విచారణ సాగింది. సాయంత్రం 5 గంటల వరకూ అధికారులు ఆయన్ని ప్రశ్నించారు. అవినాష్ రెడ్డి సీబీఐ ఆఫీసుకు వచ్చిన వెంటనే ఆయన ఫోన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివేకా హత్య జరిగిన రోజున ఆయన చేసిన వాట్సాప్ కాల్స్(Whatsapp calls) వివరాల గురించి అధికారులు ఆరా తీసినట్లు సమాచారం.
ఇటీవలే కోర్టులో కూడా సీబీఐ(CBI) వాట్సాప్ కాల్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. అవినాష్ రెడ్డి(Avinash Reddy)ని అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ను హైకోర్టు మంజూరు చేయడంతో ప్రస్తుతం ఆయనకు ఆ టెన్షన్ లేదు. అందుకే ఈ సారి హైదరాబాద్ సీబీఐ ఆఫీసు(CBI Office) వద్ద పెద్దగా ఆయన అనుచురుల గుమికూడకపోవడంతో సీబీఐ అధికారులు ఒత్తిడి లేకుండా విచారణ చేసినట్లు తెలుస్తోంది.
అవినాష్(Avinash Reddy)కు షరతులతో కూడి బెయిల్‌ను ధర్మాసనం ఇచ్చింది. ప్రతి శనివారం సీబీఐ విచారణకు ఆయన కచ్చితంగా హాజరుకావాలని ఆదేశించింది. అనుమతి లేకుండా దేశం విడిచి పెట్టి వెళ్లరాదని పలు సూచనలు చేసింది. కోర్టు తీర్పుతో వివేకా హత్య కేసులో విచారణ నుంచి అవినాష్ రెడ్డికి ఊరట లభించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు(Supreme court)కు వేసవి సెలవులు ఉండటంతో వెకేషన్ బెంచ్‌లు విచారణ చేస్తున్నాయి. అత్యవసర కేసులు అయితేనే అవి విచారిస్తాయి. ముందస్తు బెయిల్ ను సవాల్ చేస్తూ సునీత కానీ, సీబీఐ కానీ సుప్రీంకోర్టుకు వేసవి సెలవుల తర్వాతనే పిటిషన్లు ఇచ్చే అవకాశం ఉంది.