»Manda Krishna Madiga Made Hot Comments On Revanth Reddy
Revanth కోరినట్టే బీజేపీ నడుచుకుంది.. మందకృష్ణ హాట్ కామెంట్స్
టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పినట్టు బీజేపీ వింటుందనే సందేహాం కలుగుతుందని మందకృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు చేశారు. అన్నీ పార్టీలు రెడ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని రేవంత్ అనగా.. ఆ వెంటనే బండి సంజయ్‌ను తప్పించి కిషన్ రెడ్డికి పార్టీ బాధ్యతలను అప్పగించిందని గుర్తుచేశారు.
Manda Krishna Madiga Made Hot Comments On Revanth Reddy
Manda Krishna Madiga: టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై (Revanth Reddy) మందకృష్ణ మాదిగ ఓ రేంజ్లో ఫైరయ్యారు. రేవంత్‌కు కుల పిచ్చి ఉందని మండిపడ్డారు. గతంలో రేవంత్ రెడ్డి (RevanthReddy) మాట్లాడిన మాటలను మీడియాకు వినిపించారు. రేవంత్ (Revanth) పచ్చి కులతత్వ వాది, అహంకార వాది అని విరుచుకుపడ్డారు. కడుపులో కత్తి పెట్టుకుని.. పైకి మంచిగా మాట్లాడతాడని.. కత్తి పెట్టుకుని కౌగిలించుకునే రకం అని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ పార్టీలో మిగతా నేతల మాదిరిగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) కాదని మందకృష్ణ అన్నారు. రెడ్డి కులతత్వ వాది అని.. అందుకే రెడ్ల చేతిలో అధికారం ఉండాలి, భూములు ఉండాలి అన్నారని గుర్తుచేశారు. 5, 10 ఎకరాల భూములు రెడ్ల చేతిలో ఉండాలని అభిప్రాయ పడ్డారు. ఒక్క కాంగ్రెస్ పార్టీయే కాదు మిగతా పార్టీలు కూడా రెడ్డీలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అభిప్రాయపడ్డారని గుర్తుచేశారు.
చదవండి: Union Cabinet Meeting: ఏడు బహుళ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన కేంద్ర క్యాబినెట్
రేవంత్ (Revanth) కోరుకున్నట్టే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష మార్పు జరిగిందని మందకృష్ణ హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ కాకుండా.. వేరే పార్టీలలో కూడా రెడ్లు ఉండాలని చిచ్చు పెట్టారని ఆరోపించారు. బీసీ బిడ్డ బండి సంజయ్ పదవీ నుంచి తప్పించడం చాలా బాధ వేసిందన్నారు. మరో బీసీ.. లేదంటే ఎస్సీలకు అధ్యక్ష పదవీ ఇస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కిషన్ రెడ్డి.. రెడ్డికి పదవీ ఇవ్వడం వెనక అర్థం ఏంటో తెలుసుకోవాలని కోరారు. రేవంత్ (Revanth) చెప్పినట్టే బీజేపీ నడుచుకుంటుందా అనే సందేహాలు వస్తున్నాయని అంటున్నారు.
బీజేపీ హై కమాండ్ రేవంత్ సలహా తీసుకుందా..? అందుకే కిషన్ రెడ్డికి పదవీ అప్పగించిందా అనే సందేహాం వస్తోందని మందకృష్ణ అన్నారు. రేవంత్ చెప్పినట్టే బీజేపీ నడుచుకుందని.. ఇందులో ఏదో మతలబు ఉందని అంటున్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవీని మార్చడం బీజేపీ అంశం.. అయినప్పటికీ పార్టీకి బండి సంజయ్ మంచి హైప్ తీసుకొచ్చారు. ఆయనను పక్కన పెట్టి.. కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించడం నథింగ్.. పార్టీకి ఉన్న ఇమేజ్ కాస్త పోతుందని ఓ వర్గం వారు బాహాటంగానే అభిప్రాయ పడుతున్నారు.