»Ss Rajamouli In The List Of Top 100 World Influential People
SS Rajamouli: రాజమౌళికి అరుదైన గౌరవం.. వందలో ఒకడు!
RRR, బాహుబలి చిత్రాల డైరెక్టర్ SS రాజమౌళి(SS Rajamouli) అరుదైన ఘనతను సాధించారు. బాలీవుడ్ మెగాస్టార్ షారుఖ్ ఖాన్‌తో పాటు టైమ్ మ్యాగజైన్ 2023లో టాప్ 100 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. దీంతో ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఇద్దరు భారతీయులుగా వీరిద్దరు నిలిచారు. ఇక రాజమౌళి కోసం అలియా భట్ ప్రొఫైల్ రాయగా, షారూఖ్ ఖాన్ ప్రొఫైల్‌ను దీపికా పదుకొనే రాసింది.
ఈరోజు యావత్ ప్రపంచం తెలుగు ఇండస్ట్రీ వైపు చూస్తోంది అంటే.. అది కేవలం దర్శక ధీరుడు రాజమౌళి(SS Rajamouli) వల్లే. బాహుబలి అనే ప్రాజెక్ట్ రాజమౌళి చేయకపోయి ఉంటే.. టాలీవుడ్ హాలీవుడ్ లెవల్‌కి వెళ్లకపోయేది. ట్రిపుల్ ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ కొట్టేసి.. హిస్టరీ క్రియేట్ చేశాడు జక్కన్న. జేమ్స్ కామెరాన్, స్పీల్ బర్గ్ లాంటి హాలీవుడ్ దర్శక దిగ్గజాలు కూడా జక్కన్న మేకింగ్‌కు ఫిదా అయిపోయారు. అందుకే రాజమౌళి ఇప్పుడో ఇంటర్నేషనల్ బ్రాండ్ అయిపోయాడు. ఆయన నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా, న్యూస్ వచ్చిన సోషల్ మీడియా షేక్ అయిపోతోంది. ఇప్పటికే ఎన్నో అరుదైన రికార్డ్స్ క్రియేట్ చేసిన జక్కన్న.. తాజాగా వంద మందిలో ఒకే ఒక్కడుగా నిలిచాడు.
తాజాగా టైమ్స్(Times) మ్యాగజైన్ ప్రకటించిన ‘టాప్ 100 వరల్డ్ ఇన్ల్ఫూయెన్షిల్ పీపుల్’ జాబితాలో రాజమౌళి చోటు దక్కించుకున్నారు. రాజమౌళితో పాటు ఇండియాకు సంబంధించిన పలువురు సెలబ్రెటీలు కూడా ఈ లిస్ట్‌లో ఉన్నారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కూడా ఉన్నారు. అలాగే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఎలాన్ మస్క్, సాకర్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కూడా ఈ వంద మందిలో ఉన్నారు. ఇలాంటి జాబితాలో రాజమౌళి చోటు దక్కించుకోవడం విశేషం. బాలీవుడ్ మెగాస్టార్ షారుఖ్ ఖాన్‌తో పాటు టైమ్ మ్యాగజైన్ 2023లో టాప్ 100 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. దీంతో ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఇద్దరు భారతీయులుగా వీరిద్దరు నిలిచారు.
ఓ తెలుగు దర్శకుడు చోటు దక్కించకోవడం కూడా ఇదే మొదటిసారి. ఇది తెలుగోడిగా ప్రతి ఒక్కరు గర్వించదగ్గ విషయం. ప్రస్తుతం రాజమౌళి పేరు మరోసారి ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేయబోతున్నారు రాజమౌళి. ఈ సినిమాతో జక్కన్న హాలీవుడ్లో జెండా పాతేయడం ఖాయం. మరి మహేష్‌తో కలిసి రాజమౌళి ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.