జూనియర్ ఎన్టీఆర్(NTR) సూపర్ లగ్జరీ గడియారాల సేకరణను కలిగి ఉన్నాడు. అంతేకాదు అప్పుడప్పుడు వాటిని ధరించి ప్రజల్లోకి కూడా వస్తాడు. మొన్న రాత్రి టాలీవుడ్ పెద్దలకు ఎన్టీఆర్ ఇచ్చిన విలాసవంతమైన పార్టీలో ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్ చాలా కాస్లీ అని తెలుస్తోంది. అయితే దాని రేట్ ఎంతో మీరు ఒక సారి అంచనా వేయండి.
ట్రిపుల్ ఆర్ తర్వాత యంగ్ టైగర్ క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లిపోయింది. అలాంటి టైగర్ వాడే గ్యాడ్జెస్ట్ రేట్లు ఓ రేంజ్లో ఉండాల్సిందే. ముఖ్యంగా ఎన్టీఆర్(NTR) వాచ్ తరచుగా వార్తల్లో నిలుస్తునే ఉంటుంది. ఎన్టీఆర్ కనిపించినప్పుడల్లా.. అతని చేతికుండే వాచ్ హైలెట్ అవుతునే ఉంటుంది. ఇప్పటికే ఎన్నోసార్లు కోట్ల రూపాయల విలువ చేసే వాచీలు ఎన్టీఆర్ చేతికి చూశాం. అయితే ఈసారి మాత్రం అంతకుమించి అనేలా.. ఎన్టీఆర్(NTR) వాచ్(watch) రేట్ చూస్తే మైండ్ బ్లాంక్ అవాల్సిందే. రీసెంట్గా అమెజాన్ స్టూడియోస్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫారెల్.. ప్రత్యేకంగా ఎన్టీఆర్ ఇంటికొచ్చి మరీ కలిశాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ పార్టీ కూడా ఇచ్చాడు. ఈ పార్టి ఎన్టీఆర్ హాలీవుడ్ ఎంట్రీకి సంకేతం అనే చర్చ జరుగుతోంది.
ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు తారక్. అయితే.. ఇందులో యంగ్ టైగర్ చేతికున్న వాచ్ పై అందరి దృష్టి పడింది. చూడడానికి చాలా సింపుల్‌గా ఉన్న ఆ వాచ్ రేట్ చూస్తే.. ఖచ్చితంగా దిమ్మ తిరిగిపోతుంది. రిచార్డ్ మిల్లే బ్రాండ్‌కు చెందిన ఈ మెక్క్లారెన్ ఎడిషన్ వాచ్ విలువ అక్షరాల 8 కోట్లకు పైగా ఉంటుందని అంటున్నారు. ప్రపంచంలో మోస్ట్ కాస్ట్లీ వాచీలలో రిచర్డ్ మిల్లే బ్రాండ్ టాప్ ప్లేస్‌లో ఉంటుంది. ఈ బ్రండ్ వాచ్ రేట్లు.. మినిమమ్ కోటి రూపాయల నుంచి ఉంటుంది. చాలా తక్కువ మంది మాత్రమే ఈ వాచీలు వాడుతున్నారు. వారిలో యంగ్ టైగర్ కూడా ఒకరు.
గతంలోనూ ఎన్టీఆర్ వాచ్ కాస్ట్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ ఈసారి ఏకంగా 8 కోట్ల వాచ్ అనేసరికి.. అంతా షాక్ అవుతున్నారు. ఇకపోతే.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ చేస్తున్నాడు యంగ్ టైగర్. ఇటీవలె ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ అయింది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఎన్టీఆర్ 30 రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ 31 స్టార్ట్ కానుంది. ఏదేమైనా ఎన్టీఆర్ వాచీ ధర మాత్రం.. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.