ప్రముఖ హీరోయిన్ సమంత(Samantha Ruth Prabhu) యాక్ట్ చేసిన పాన్ ఇండియా మూవీ శాకుంతలం(Shaakuntalam) ఈరోజు(ఏప్రిల్ 14న) విడుదలైంది. అభిజ్ఞాన శాకుంతలం స్టోరీ ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం లవ్ స్టోరీ ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.
2022లో వచ్చిన యశోద చిత్రం తర్వాత సమంత రూత్ ప్రభు(Samantha Ruth Prabhu) యాక్ట్ చేసిన పౌరాణిక డ్రామా చిత్రం శాకుంతలం(Shaakuntalam) ఈరోజు(ఏప్రిల్ 14న) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రానికి గుణశేఖర్ రచన, దర్శకత్వం వహించారు. గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ టీమ్ వర్క్స్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా(Movie)కు సంబంధించిన టీజర్, ట్రైలర్లు విడుదలై(Release) ఈ చిత్రంపై అంచనాలు మరింత పెంచేశాయి. మరోవైపు ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేశారు. దీంతోపాటు ఈ సినిమాను 2డీతోపాటు 3Dలోనూ మేకర్స్ రిలీజ్ చేసిన నేపథ్యంలో ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి చుద్దాం.
కథ
మహాకవి కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ అనే ప్రసిద్ధ నాటకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో శాకుంతల (సమంత), దుష్యంత్ (దేవ్ మోహన్) మధ్య జరిగే పురాణ ప్రేమకథను దర్శకుడు చూపించారు. ఇక కథలోకి వెళితే విశ్వామిత్రుని తపస్సును మేనక(మధుబాల) భంగం చేసిన క్రమంలో ఆమెకు, విశ్వామిత్రునికి పుట్టిన బాలికనే శాకుంతల. కానీ మేనక భూలోకానికి చెందిన వ్యక్తితో కలిగిన సంతానం పొందిన నేపథ్యంలో దేవలోకంలోకి శాకుంతలను తీసుకెళ్లకుండా భూలోకంలోని ఓ అడవిలో వదిలి వెళుతుంది. ఆ క్రమంలో గమనించిన కణ్వాశ్రమ మహర్షి ఆమెను పెంచి పెద్ద చేస్తాడు. ఆ తర్వాత ఆ కణ్వాశ్రమంపైకి ఓసారి పులుల గుంపు దాడి చేస్తుంది. ఆ సమయంలో హీరో దుష్యంత్ (దేవ్ మోహన్) వాటిని అడ్డుకుని ఆ ప్రాంతవాసులను రక్షిస్తాడు. అదే క్రమంలో శాకుంతలను చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా తొలిసారి చుపులోనే ప్రేమిస్తుంది. దీంతో ఇద్దరు కలిసి ఎవ్వరికీ తెలియకుండా జంతు
వుల సమక్షంలో సమంతను హీరో గాంధర్వ వివాహం చేసుకుంటాడు. ఆ నేపథ్యంలో వారిద్దరూ శారీరకంగా కలుస్తారు. ఆ క్రమంలో హీరో దుష్యంత మహారాజు మళ్లీ వచ్చి సమంతను తన రాజ్యానికి తీసుకెళ్తానని చెబుతాడు. కానీ అతను మళ్లీ రాడు. అసలు ఏందుకు రాజు శాకుంతల దగ్గరకు రాకుండా ఉంటాడు? ఆ క్రమంలో గర్భవతిగా మారిన హీరోయిన్ ఏం చేసింది? చివరికి వారిద్దరు కలిసారా లేదా? ఆ క్రమంలో సమంత ఎదుర్కొన్న ఇబ్బందులు ఎంటనేది అసలు స్టోరీ.
ఎలా ఉందంటే
మొదటి భాగంలో శాకుంతల (సమంత), దుష్యంత్ (దేవ్ మోహన్) మధ్య జరిగిన లవ్ స్టోరీని చూపిస్తారు. మళ్లీ వచ్చి తీసుకెళ్తానని హీరో ఆమెను తీసుకెళ్లకుండా ఉంటాడు. ఆ క్రమంలో సమంత గర్భవతిగా ఉంటుంది. అదే క్రమంలో మోహన్ బాబు ఆ ప్రాంతాన్ని సందర్శించి కోపంతో ఆమెకు శాపం పెడతాడు. దీంతో ఫస్టాఫ్ పూర్తవుతుంది. వాటిలో కొన్ని సీన్లు ఆకట్టుకుంటాయి. కానీ మరికొన్ని సీన్లలో అయితే గ్రాఫిక్స్ ఎక్కువగా అయినట్లు అనిపిస్తుంది. మరోవైపు కథలో ఎమోషన్స్ ని సరిగా చూపించడంలో దర్శకుడు విఫలమైనట్లు అనిపిస్తుంది. ఇక సెకండాఫ్ లో సమంత పడిన కష్టాలు సహా పలు సీన్లను తెరకెక్కించగా..ఆ తర్వాత హీరో ఆమెను ఎలా చేరుకున్నాడనేది ట్విస్ట్ గా చూపించారు. మరోవైపు ఫైట్ సీన్లలో కూడా గ్రాఫిక్స్ ఓవర్ అయినట్లు అనిపిస్తుంది. ఇంకోవైపు ఇలాంటి కథలను ప్రస్తుత తరానికి చూపించాలంటే ఎంతో ఆసక్తిగా చూపించాలి. కానీ ఈ చిత్రంలో చాలా చోట్ల రోటిన్ సీన్స్ పేలవంగా అనిపిస్తాయి.
ఎవరెలా చేశారు
శాకుంతలంలోని ప్రధాన పాత్రలు శకుంతల, దుష్యంత్. శకుంతల పాత్రలో సమంత నటించింది. ఈ చిత్రంలో సమంత రెండు క్యారెక్టర్లను కలిగి ఉంటుంది. అబిజ్ఞాన శాకుంతలంలోని శృంగార శాకుంతల, ఆత్మాభిమాన శాకుంతలగా కనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో సమంత యాక్టింగ్ ప్రేక్షుకులను భావోద్వేగానికి గురి చేస్తుంది. మరోవైపు తన క్యారెక్టర్లో కెరీర్లో ఇందులో బెస్ట్ ఇచ్చిందని అని చెప్పవచ్చు. మరోవైపు దుష్యంత్ పాత్రలో దేవ్ మోహన్ బాగా కనిపించాడు. రెండు చిన్న సీక్వెన్స్‌లను మినహాయించి, అతను చాలా వరకు మంచి నటనను కనబరిచాడు. సచిన్ ఖేడ్కర్, మోహన్ బాబు ప్రకాష్ రాజ్, గౌతమి మధు, కబీర్ బేడీ, జిషు సేన్‌గుప్తా, కబీర్ దుహన్ సింగ్, హరీష్ ఉత్తమన్, సుబ్బరాజు, ఆదర్శ్ బాలకృష్ణ, జిషు సేన్‌గుప్తా, మధు, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల సహా ఇతరులు తమ పాత్రల పరిధి మేరకు న్యాయం చేశారు. సినిమా చివరిలో అల్లు అర్హ క్యారెక్టర్ ఆకట్టుకుంటుంది.
ప్లస్ పాయింట్స్
సమంత యాక్టింగ్
మణిశర్మ బీజీఎం
కొన్ని డైలాగ్స్
మైనస్ పాయింట్స్
లాగ్ సీన్స్
స్టోరీలో కొత్తదనం లేకపోవడం
నాసిరకం వీఎఫ్ఎక్స్
కథలో ఎమోషన్స్ లోపం