»Singer Mangli Released Three Maha Shivaratri Special Songs
Maha Shivaratri: మంగ్లీ సంచలనం.. శివుడిపై ఒకేసారి 3 పాటలు
మహా శివరాత్రి (Maha Shivaratri)ని పురస్కరించుకుని ఈసారి మంగ్లీ ఏకంగా మూడు పాటలను విడుదల చేసింది. అది కూడా పాన్ ఇండియా మాదిరి తెలుగుతోపాటు హిందీ, కన్నడ భాషల్లో పాటను రూపొందించారు. భక్తి తన్మయత్వంతో కూడిన ఈ పాటలను భక్తులను మైమరపిస్తున్నాయి. భక్తి తన్మయత్వంతో కూడిన ఈ పాటలు భక్తులను మైమరపిస్తున్నాయి.
పండుగలు వస్తున్నాయంటే చాలు ప్రత్యేకంగా పాటలు వస్తున్నాయి. యూట్యూబ్ (Youtube)తో యువ కళాకారులు తమ ప్రతిభను చాటుతూ ప్రత్యేక గీతలు విడుదల చేస్తున్నారు. తెలంగాణ ఆత్మగౌరవం బతుకమ్మ పండుగ (Bathukamma Festival)తో మొదలైన ఈ ట్రెండ్ సంక్రాంతి, ఉగాది, మహాశివరాత్రి, హోలీ, న్యూఈయర్, వినాయక చవితి, దీపావళి, దసరా తదితర పండుగలకు కూడా ప్రత్యేక పాటలు రూపొందుతున్నాయి. ఆ పాటలన్నీ యూట్యూబ్ వేదికగా విడుదలై ట్రెండింగ్ లోకి వస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణకు చెందిన యువత ఈ గీతాలను రూపొందిస్తూ ప్రత్యేకత చాటుతున్నారు. ఈ విధంగానే పాటలను చేస్తూనే ప్రస్తుతం టాప్ ప్లే బ్యాక్ సింగర్ గా మంగ్లీ (Mangli) ఎదిగారు. ఏదైనా పండుగ వస్తుందంటే మంగ్లీ పాట కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తాజాగా మహా శివరాత్రి (Maha Shivaratri)ని పురస్కరించుకుని ఈసారి మంగ్లీ ఏకంగా మూడు పాటలను విడుదల చేసింది. అది కూడా పాన్ ఇండియా మాదిరి తెలుగుతోపాటు హిందీ, కన్నడ భాషల్లో పాటను రూపొందించారు. భక్తి తన్మయత్వంతో కూడిన ఈ పాటలు భక్తులను మైమరపిస్తున్నాయి.
‘భం భం బోలే’ (Bham Bham Bhole Song) అంటూ మూడు భాషల్లో మంగ్లీ తన యూట్యూబ్ చానల్ (Mangli Official) లో విడుదల చేసింది. ఈ పాటలు ట్రెండింగ్ లో నిలిచాయి. ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తేజ (Suddala Ahok Teja) అద్భుతమైన సాహిత్యం అందించగా.. ప్రశాంత్ ఆర్.విహారి (Prashanth R Vihari) సంగీతం అందించాడు. నూతనపాటి రామకృష్ణ స్పాన్సర్ గా వ్యవహరించాడు. మంగ్లీ శ్రవణానందంగా ఆలపించింది. ‘దరువేయరా స్వామి భంభం బోలే.. చిందేయరా స్వామి భంభం బోలే’ అంటూ భక్తులు ఆడి పాడుకునేలా పాట రూపొందించారు. దేశంలోని 12 జ్యోతిర్లింగాలను ప్రస్తావిస్తూ శివుడిని కీర్తిస్తూ పాట ఉంది. ఈ పాటకు యానీ మాస్టర్ (Anee Master) నృత్య రీతులు అందించారు. తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాల్లో ఈ పాట చిత్రీకరించారు. తెలంగాణలోని వేములవాడ (Vemulawada)తో మరో ఆలయంలో చిత్రీకరించగా.. ఏపీలోని శ్రీకాళహస్తిలో ప్రధానంగా షూటింగ్ చేశారు.
తొలిసారిగా హిందీ, కన్నడలో మంగ్లీ పాట రూపొందించింది. ఇక భంభం బోలే పాటనే హిందీ, కన్నడలో తీశారు. ఈ పాటకు హిందీ సాహిత్యాన్ని సిరా శ్రీ అందించగా.. మంగ్లీతో పాటు ఆమె సోదరి ఇంద్రావతి చౌహాన్ (Indravathi Chauhan) కూడా శ్రావ్యంగా పాడింది. హిందీ ప్రజలను ఆకట్టుకోవడంతో పాటు ప్రసిద్ధ శైవ క్షేత్రం కాశీ ఆలయం ఇతివృత్తంలో ఈ పాటను చిత్రీకరించారు. గంగా నదీలో మంగ్లీ, ఇంద్రావతి, యానీ మాస్టర్ చిందేయరా స్వామి భంభం బోలే అంటూ చిందేశారు. ఈ పాటకు వీక్షకుల సంఖ్య క్రమేణా పెరుగుతున్నది. ఈ పాటకు కన్నడలో వరదరాజు చిక్ బళ్లాపురా సాహిత్యం అందించాడు. కన్నడలో మంగ్లీ మాత్రమే ఆడిపాడింది.
పాట ఇలా ఉంది..
పల్లవి
దిమి దిమి భేరి నాధం మొగే మేఘమ్ తాకే భూగోళం
తాకదిం రంకే వేసి దుంకే నందిని చూసే పాతాళం
ఆహా బ్రహ్మ వచ్చి నిన్నే మెచ్చి అందేలు ఇచ్చిన ఆనందం
అరే శంఖము చక్రము వీడిన విష్ణువు వీణలు మీటిగా విడ్డురం
ఏడు గుర్రాల రధం ఎక్కి సూరీడు చూడగా
తరకలన్ని తప్పేట కొట్టె తాకిట తాళం తోడుగా
గౌరమ్మ తోని కాలు వేలు కలిపేసి తాండవ శివ
దరువెయ్యరా స్వామి డం డం డోలే
చిందెయ్యరా స్వామి భం భం బోలే (2)
చరణం 1
పులితోలు నిపంట కురులన్నీ జడగట్ట
తణువంత మసి పుట్ట భాస్మంగా
అయినా గంగవ్వ నడిచింది నీతోవ
సురలే తలదించి చూడంగా
ఆ చందమమే చంద్రావంకై
ఏన్నెలా పువ్వుగా మారంగా
మరి నిప్పుల బండాన్ని
రెప్పతో మింగేసి ముక్కంటి వాయినావు చిత్రంగా
నాగు సర్పలే ని ఆభరణలై ఆడేటి ఓహ్ లింగా
కోటి దేవుళ్ళకు రూపమ్ నీవు సోమనాథ లింగా
గౌరమ్మ తోని కాలు వేలు కలిపేసి తాండవ శివ
దరువెయ్యరా స్వామి డం డం డోలే
చిందెయ్యరా స్వామి భం భం బోలే
చరణం 2
చలి వెండి కొండల్లో స్పటిక జ్యోతిర్లింగ
నిలిచావు కేదారానాదంగా
అరుణాచలము లోన తిరుముగ నెల ఉండి
కరుణించుతున్నావు సల్లంగా
కాశీ విశ్వ రూపి వంట
శ్రీ కాళహస్తి లో శ్రీ కంట
శ్రీశైలవాసన శ్రీమల్లికార్జున స్వామివై ఉండయ్య మా ఇంట
రమేశ్వరము లోన వరము లీయ్యా వెలసినావంట
భారత కాండాన పనేండు జ్యోతుల వెలిగినావంట
గౌరమ్మ తోని కాలు వేలు కలిపేసి తాండవ శివ
దరువెయ్యరా స్వామి డం డం డోలే
చిందెయ్యరా స్వామి భం భం బోలే