దాదాపు ఆరేళ్ల తర్వాత గుర్తింపు సంఘం ఎన్నికలు రావడంతో కార్మిక సంఘాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాగా ఇవి కేవలం కార్మిక సంఘాల ఎన్నికలు అయినా పార్టీలు ప్రత్యక్షంగా పాలుపంచుకోవు. కానీ తమ అనుబంధ సంఘాలు ఉండడంతో ఎమ్మెల్యే ఎన్నికల మాదిరే ఈ సంఘం ఎన్నికలు ఉండనున్నాయి.
ఎమ్మెల్సీ ఎన్నికలు అలా ముగిశాయో లేదో మరో ఎన్నికకు తెలంగాణలో సమయమొచ్చింది. ఇన్నాళ్లు అనేక అవాంతరాలతో వాయిదా పడుతున్న సింగరేణి సంస్థ (Singareni Collieries Company Limited (SCCL) గుర్తింపు సంఘం ఎన్నికలకు ఎట్టకేలకు ప్రకటన విడుదలైంది. సింగరేణి సంస్థలో కార్మిక సంఘాల ఎన్నికలకు సింగరేణి సంస్థ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ఏప్రిల్ 2న ఎన్నికల ప్రకటన విడుదల కానుంది. ఆరేళ్ల తర్వాత మళ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.
హైదరాబాద్లో (Hyderabad)ని సింగరేణి కార్యాలయంలో సోమవారం అధికారులు (Officials) కార్మిక సంఘాల (Labour Associations) తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి (Returning Officer)గా శ్రీనివాసులను నియమించారు. సమావేశానికి 32 కార్మిక సంఘాలు (Trade Unions) రావాల్సి ఉండగా కేవలం 15 మాత్రమే హాజరయ్యాయి. వాస్తవంగా రెండేళ్లకోసారి ఎన్నికలు (Election) జరుగాల్సి ఉంది. 2017లో జరిగిన ఎన్నికలు అనేక వివాదాలు, ఆటంకాలు, గండాలతో నాలుగేళ్ల పాటు అధికారం పొడిగించాల్సి వచ్చింది. అయితే ఈ ఎన్నికలపై న్యాయ వివాదం తలెత్తడంతో వెంటనే యాజమాన్యం స్పందించింది. ఎన్నికలు నిర్వహించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు సోమవారం కార్మిక సంఘాలతో ఇదే విషయం పేర్కొంది. దీంతో ఆయా సంఘాలు కూడా ఎన్నికలకు సన్నద్ధం ప్రకటించాయి.
ఈ సమావేశానికి ఏఐటీయూసీ (AITUC), టీఎన్ టీయూసీ (TNTUC), హెచ్ఎంఎస్ (HMS), బీఎంఎస్ (BMS), సీఐటీయూ (CITU), గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ (TBGKS), టీఎన్టీయూసీ (TNTUC), ఐఎఫ్ టీయూ (IFTU), ఏఐఎఫ్ టీయూ (AIFTU), తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం, తెలంగాణ రీజనల్ సింగరేణి కార్మిక సంఘం, తెలంగాణ సింగరేణి కార్మిక సంఘం, సింగరేణి డ్రైవర్స్ ఈపీ ఆపరేటర్స్ అండ్ అండర్ గ్రౌండ్ ఆల్ ట్రేడ్స్ వర్కర్స్ అసోసియేషన్ తదితర సంఘాలు సమావేశానికి హాజరయ్యాయి. ఏప్రిల్ (April) 2న మరోసారి కార్మిక సంఘాలతో సమావేశమై వారితో చర్చించిన అనంతరం అదే రోజు గుర్తింపు సంఘం ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నియమితులైన శ్రీనివాసులు స్పష్టం చేశారు. మే (May) నెలలో ఈ ఎన్నికలు పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత గుర్తింపు సంఘం కాల వ్యవధి మే చివరి వారంతో ముగుస్తుంది. 45 రోజుల్లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దీనికోసం సింగరేణి సంస్థ కసరత్తు చేస్తోంది.
కాగా ఈ ఎన్నికల విషయమై కార్మిక సంఘాలు సింగరేణి సంస్థకు కొన్ని వినతులు చేశాయి. ప్రస్తుతం ఉన్న రెండేళ్ల కాల పరిమితిని నాలుగేళ్లకు మార్చాలని కోరాయి. ఎన్నికలకు ఓటింగ్ మెషీన్లను వినియోగిస్తామని ప్రతిపాదించగా సంఘాలు వ్యతిరేకించాయి. బ్యాలెట్ప (Ballot) ద్ధతిలోనే ఎన్నికలు జరుగాలని స్పష్టం చేశాయి. కాంట్రాక్ట్ (Contract) కార్మికులకు కూడా ఓటింగ్ అవకాశం కల్పించాలని కోరగా యాజమాన్యం నిరాకరించింది. శాశ్వత ఉద్యోగులకు మాత్రమే ఓటు హక్కు ఉంటుందని సింగరేణి సంస్థ పేర్కొంది.
ప్రతిష్టాత్మకం
దాదాపు ఆరేళ్ల తర్వాత గుర్తింపు సంఘం ఎన్నికలు రావడంతో కార్మిక సంఘాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాగా ఇవి కేవలం కార్మిక సంఘాల ఎన్నికలు అయినా పార్టీలు ప్రత్యక్షంగా పాలుపంచుకోవు. కానీ తమ అనుబంధ సంఘాలు ఉండడంతో ఎమ్మెల్యే ఎన్నికల మాదిరే ఈ సంఘం ఎన్నికలు ఉండనున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు రాబోతుండడంతో కార్మిక సంఘం ఎన్నికల్లో గెలువాలని పార్టీలు భావిస్తున్నాయి. దాదాపు 8 జిల్లాల్లో సింగరేణి ప్రభావం ఉంటుంది. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ అనుబంధ సంఘం విజయం సాధిస్తుందో అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ప్రభావం భారీగా ఉంటుంది. అందుకే ఈ ఎన్నికలను బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఎలాగైనా ఈ ఎన్నికల్లో తమ సంఘం విజయం సాధించాలనే పట్టుదలతో ఇరు పార్టీలు ఉన్నాయి.