»Singareni Elections The Date Of Singareni Elections Has Been Finalized
Singareni elections: సింగరేణి ఎన్నికల తేదీ ఖరారు
సింగరేణి సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు తేదీ ఖారారైంది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వల్ల సింగరేణి ఎన్నికలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలను ఈ నెల నిర్వహించనున్నారు.
Singareni elections: ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు తేదీ ఖరారైంది. ఎన్నికలు నిర్వహించాలని భావించిన తరుణంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో సింగరేణి ఎన్నికలు వాయిదా వేయమని యాజమాన్యం హైకోర్టులో పిటిషన్ వేసింది. పిటిషన్ను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు సింగరేణి ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు డిసెంబర్ 27న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతాయని కార్మికశాఖ తెలిపింది.
ఇప్పటి వరకు గుర్తింపు సంఘంగా బాధ్యతలు నిర్వహించిన టీబీజీకేఎస్ కాలపరిమితి ముగిసి నాలుగేళ్లు కావడంతో ఎన్నికలు తప్పనిసరి అయ్యాయి. సింగరేణి సంస్థలో 1990 నుంచి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. 1998, 2000 వరకు జరిగిన ఎన్నికలకు కాలపరిమితి రెండు సంవత్సరాలు ఉండేది. కానీ 2003లో తొలిసారిగా గుర్తింపు సంఘం కాలపరిమితి నాలుగేళ్లకు పెంచారు. మళ్లీ 2017లో గుర్తింపు సంఘం ఎన్నికల్లో కాలపరిమితిని రెండు సంవత్సరాలకు కుదించారు. రెండేళ్ల కాలపరిమితిలో బాధ్యతలు చేపట్టిన టీబీజీకేఎస్ కాలపరిమితి పూర్తయి మరో నాలుగేళ్లు అదనంగా గడిచాయి.