Adani Market Value: వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది హిండెన్‌బర్గ్ తెలిపిన నివేదికతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా పడిపోయాయి. హిండెన్‌బర్గ్ నివేదికతో అదానీ గ్రూపు కంపెనీల షేర్లు నష్టాల బాట పట్టాయి. కుంగిపోయిన అదానీ గ్రూప్ షేర్లు గత వారం నుంచి మళ్లీ పుంజుకున్నాయి. నిన్న ఒక్క రోజే అదానీ గ్రూప్‌లోని 10 లిస్టెడ్ కంపెనీల షేర్ల మార్కెట్ విలువ రూ.71,380 కోట్లు పెరిగి రూ.12 లక్షల కోట్లకు చేరింది. దీంతో అదానీ వ్యక్తగత సంపద 6580 కోట్ల డాలర్లకు చేరింది. అంటే సుమారుగా రూ.5046 లక్షల కోట్లు.
ప్రపంచ కుబేరుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న అదానీ.. హిండెన్‌బర్గ్ నివేదికలోని ఆరోపణలు కారణంగా నెలరోజుల్లో అగ్రగామి-25 మంది కుబేరుల జాబితాలో లేకుండా పోయారు. అయితే బ్లూమ్‌బర్గ్ కుబేరుల సూచీలో గౌతమ్ అదానీ 65.8 బిలియన్ డాలర్ల సంపదతో 20వ స్థానంలో ఉన్నట్లు తెలిపింది. కానీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అదానీ గ్రూపుకి చెందిన 10 కంపెనీల షేర్లు నిన్న పెరిగాయి. మొత్తం 24 అంశాల్లో హిండెన్‌బర్గ్ నివేదికను విడుదల చేయగా 22 కేసులపై సీబీఐ దర్యాప్తు పూర్తిచేసింది. సెబీ ఏ విషయం చెప్పకపోవడంతో అదానీ గ్రూప్ షేర్లు మళ్లీ ర్యాలీబాట పట్టాయి.