»Zee Entertainment Zee Shares Down Heavily Is It True That The Losses
Zee Entertainment: భారీగా తగ్గిన జీ షేర్లు.. నష్టాల్లోకి నిజమేనా?
సోనీ పిక్చర్స్‌లో విలీనం కోసం ప్రయత్నిస్తున్నట్లు వార్తలు రావడంతో నిన్న జీ షేర్లు 8.03 శాతం పెరిగాయి. కానీ ఈరోజు జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ షేర్లు నష్టాల్లోకి చేరాయి.
Zee Entertainment: జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ షేర్లు ఈరోజు నష్టాల్లోకి చేరాయి. సోనీ పిక్చర్స్‌లో విలీనం కోసం ప్రయత్నిస్తున్నట్లు వార్తలు రావడంతో నిన్న జీ షేర్లు 8.03 శాతం పెరిగాయి. అయితే ఈరోజు షేర్లు విలువ 11 శాతానికి పైగా నష్టపోయి రూ.171 వద్ద ట్రేడవుతోంది. కంపెనీ ఖాతాల్లో దాదాపు రూ.2000 కోట్లు విలువ చేసే అవకతవకలను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ గుర్తించినట్లు ఓ నివేదిక తెలిపింది. అయితే ఈ కంపెనీ రూ.200 కోట్ల విలువైన నిధులను మళ్లించినట్లు సెబీ తెలుసుకుంది.
ప్రస్తుతం మళ్లించిన నిధులు సెబీ అంచనా వేసిన దానికంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ. దీనిపై జీ, సెబీ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్‌తో కుదిరిన ఒప్పందాన్ని కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. దీన్ని మళ్లీ పునరుద్ధరించేందుకు ఇరు సంస్థలు చర్చలు జరుపుతున్నాయని వార్తలు వస్తున్నాయి. జీ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర, గోయెంకా తమ సొంత ప్రయోజనాల కోసం కంపెనీ నిధులను దారి మళ్లించారని ఆరోపణలు వస్తున్నాయి.