»Youtuber Nasiruddin Ansari Fraud In The Name Of Stock Market Sebi Orders To Return Rs 17 2 Crores
Stock market: పేరిట యూట్యూబర్ మోసం..రూ.17.2 కోట్లు వెనక్కి ఇవ్వాలని సెబీ ఆదేశం
స్టాక్ మార్కెట్లో డబ్బు ఇన్వెస్ట్ చేయాలంటే దాని గురించి ఎంతో కొంత తెలియాలి. వాటి గురించి పూర్తిగా తెలుసుకుని అందులో ఇన్వెస్ట్ చేయాలని పలువురు సోషల్ మీడియాను ఆశ్రయిస్తారు. కానీ కొందరు స్టాక్ నిపుణులమని చెప్పి..చట్ట విరుద్ధంగా డబ్బు సంపాదిస్తుంటారు. ఇలాంటి వారిని గుర్తించి వాటిని ఆపడానికి సెబీ ముందుకు వచ్చింది.
Nasiruddin Ansari: స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదేనా? ఎందులో ఇన్వెస్ట్ చేయాలి? వంటి విషయాలు చాలామందికి తెలియవు. దీంతో అనేక మంది సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. అయితే ప్రస్తుతం కొందరు సోషల్ మీడియా ద్వారా ఇన్ఫ్లూయెన్సర్లుగా మారి.. ఇలా స్టాక్ మార్కెట్లు గురించి చెబుతుంటారు. స్టాక్ మార్కెట్ నిపుణులమని చెప్పి కొన్ని స్టాక్స్‌ను సిఫార్సు చేస్తున్నారు. దీనివల్ల వారు చెప్పినవి అమలు కాకపోవడం వల్ల చాలామంది సామాన్యులు నష్టపోతున్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టడానికి సెబీ ముందుకు వచ్చింది. తాజాగా మహమ్మద్ నసీరుద్దీన్ అన్సారీ అనే వ్యక్తిని స్టాక్ మార్కెట్ నుంచి పూర్తిగా నిషేధించింది. ఆయన నిర్వహిస్తున్న ‘బాప్ ఆఫ్ చార్ట్’ అనే సంస్థను కూడా పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించింది. సోషల్ మీడియా ద్వారా అన్సారీ బాప్ ఆఫ్ చార్ట్‌తో ప్రొఫైల్‌ను నడుపుతున్నారు. దీనిద్వారా కొన్ని స్టాక్ వివరాలను తెలియజేస్తున్నాడు. అలాగే కోర్సులను కూడా నిర్వహిస్తున్నాడు.
తన కోర్సుల్లో చేరిన వారికి రాబడి వస్తుందని..వివిధ కోర్సుల పేరిట సామాన్యుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు. దీనిపై సెబీ దృష్టి సారించింది. బలవంతంగా వాళ్లను స్టాక్ మార్కెట్లోకి లాగుతున్నారని.. అతన్ని స్టాక్ మార్కెట్ నుంచి నిషేధించింది. ఇలా కోర్సుల పేరిట అతను రూ.17.2 కోట్లు చట్టవిరుద్ధంగా సంపాదించాడు. ఈ డబ్బునంతటిని 15 రోజుల్లోగా తిరిగి ఇవ్వాలని సెబీ ఆదేశించింది. ఏ పేరుతోనైనా పెట్టుబడి సలహాదారులుగా వ్యవహరించరాదని సెబీ హెచ్చరించింది. ప్లే స్టోర్‌లో తన యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిని డౌన్లోడ్ చేసుకుని.. కోర్సులు పూర్తి చేయాలని అన్సారీ చెప్పేవాడు. ఇలా మొత్తం 19 కోర్సులను విక్రయిస్తున్నాడు. ఇతను నడిపే బాప్ ఆఫ్ చార్ట్ యూట్యబ్ ఛానెల్‌కు 4.43 లక్షల మంది సబ్స్క్రైబర్లు కూడా ఉన్నారు. ఈయన రోజు నిర్వహించే వర్క్‌షాప్‌లకు చాలామంది హాజరవుతున్నారు.