శేషాచల అడవిలో లభించే అరుదైన లెపిడోగాథిస్ జాతికి చెందిన మొక్కకు దివంగత నేత వైఎస్సార్ పేరు పెట్టారు. అయితే ఇది తెలిసిన నెటిజన్లు ఘోరంగా కామెంట్లు చేస్తున్నారు. అవెంటో మీరు కూడా చూసేయండి మరి.
Lepidogathis, a rare plant found in Seshalachal forest, is named after YS Rajasekhar Reddy.
Viral News: మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్(YSR) పేరును ఒక అరుదైన మొక్కకు పెట్టి, విద్యారంగానికి సేవా చేసిన నేతకు గౌరవం తీసుకొచ్చామని ప్రొఫెసర్ మధుసుదన్ రెడ్డి పేర్కొన్నారు. శేషాచల అడవుల్లో మాత్రమే లభించే అరుదైన మొక్కకు దివంగత నేత వైఎస్సార్ పేరు పెట్డడం సంతోషంగా ఉందన్నారు. లెపిడోగాథిస్(Lepidogathis) జాతికి చెందిన మొక్కకు ప్రజాతిగా రాజశేకర్ అనే నామకరణం చేశారు. దీనిని రాయల్ బొటానికల్ గార్డెన్, బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాతో మరికొన్ని పరిశోధన సంస్థలు ధ్రువీకరించాయి.
విద్యారంగానికి ఆయన చేసిన సేవలకు ఆయన పేరు పెట్టినట్లు వైవీయూ వృక్ష శాస్త్ర విభాగం ప్రొఫెసర్ మధుసుదన్ రెడ్డి తెలిపారు. అయితే దీనిపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. ఎంతలేదన్నా దీన్ని రాజకీయ కోణంలోనే చూస్తున్నారు. చాలా మంది ప్రజానేత రాజశేఖర్ ప్రత్యేకమైన వ్యక్తి కాబట్టి అరుదైన మొక్కకు ఆయన పేరుపెట్టడం గొప్ప విషయంగా భావిస్తున్నామంటున్నారు. మరికొందరు మాత్రం ప్రభుత్వం సంస్థలు, గ్రామపంచాయితీలకే మీ పార్టీ రంగును వేసుకున్నారని కామెంట్లు చేశారు. అంతేకాదు ఇంకొంత మంది అయితే అఖరికి చెట్లను కూడా వదలరా, ఇంతకంటే దారుణం మరొకటి ఉండదని వ్యాఖ్యానించారు. అసలు విద్యారంగానికి వైఎస్సార్ అంతగొప్ప సేవ ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు.