స్టార్ హీరో నితిన్ యాక్ట్ చేస్తున్న తాజా చిత్రం ఎక్స్ ట్రా నుంచి సరిక్తొత్త అప్ డేట్ వచ్చింది. ఈ మూవీలో ప్రముఖ సీనియర్ హీరో యాక్ట్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే అతనెవరో ఇప్పుడు చుద్దాం.
యంగ్ హీరో నితిన్, క్రేజీ బ్యూటీ శ్రీలీల జంటగా నటిస్తున్న కొత్త చిత్రం ఎక్స్ ట్రా(EXTRA). ఈ మూవీని నితిన్ తన సొంత బ్యానర్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ మూవీ నుంచి తాజాగా ఓ పాటను విడుదల చేశారు. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ విషయం బయటకు వచ్చింది. ఈ మూవీలో యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్(rajasekhar) నటిస్తున్నారట. ఆయన పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. మరి ఆయన రోల్ మూవీకి ఎంత ప్లస్ అవుతుందో చూడాలి.
ఇదిలా ఉండగా కొద్ది రోజుల క్రితం ఈ మూవీ నుంచి ‘డేంజర్ పిల్లా పిల్లా’ అనే ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ పాట లొకేషన్స్ చాలా అందంగా ఉన్నాయి. నితిన్, శ్రీలీల జోడి కూడా చూడటానికి బాగుంది. పాట మొత్తం విదేశాల్లో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. “అరె బ్లాక్ అండ్ వైట్ సీతాకోక చిలుకవా..చీకట్లో తిరగని మిణుగురు తళుకువా” అంటూ పాట సాగింది. హరీష్ జైరాజ్ మ్యూజిక్ అందించారు. ఈ పాటను కృష్ణకాంత్ స్వరపరచగా, అర్మాన్ మాలిక్ అద్భుతంగా పాడాడు.
కాగా ఈ మూవీలో ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. శేఖర్ కొరియోగ్రఫీ ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. దానికి తగినట్లు నితిన్ కూడా డ్యాన్స్ ఇరగదీశాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీని ఈ ఏడాది డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా నితిన్, వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఆ సినిమాలో మొదట రష్మికను హీరోయిన్ గా తీసుకున్నారు. కొన్ని కారణాల వల్ల ఆమె ఈ మూవీ నుంచి తప్పుకోవడంతో ఆ స్థానంలోకి శ్రీలీలను తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే, వీరి కాంబినేషన్ లో బ్యాక్ టూ బ్యాక్ రెండు సినిమాలు రానున్నాయి.