»Brush Vesko Lyrical Extra Ordinary Man Nithiin Sreeleela Vakkantham Vamsi Harris Jayaraj
Brush Vesko: నితిన్ నుంచి ‘హే మామ బ్రెష్షె వేసుకో’ లిరికల్ సాంగ్ విడుదల
నితిన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్గా తెరకెక్కుతున్న ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ నుంచి హే మామా బ్రష్షే వేస్కో.. మైండంతా రిఫ్రెష్ చేస్కో అనే సాంగ్ విడుదలైంది. రామ జోగయ్య శాస్త్రి రాసిన ఈ లిరికల్స్ ఎలా ఉన్నాయో చూసేయండి.
Brush Vesko Lyrical Extra - Ordinary Man Nithiin Sreeleela Vakkantham Vamsi Harris Jayaraj
Brush Vesko: నితిన్(Nithiin), శ్రీలీల(Sreeleela) హీరోహీరోయిన్లుగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్( Extra – Ordinary Man). ఈ చిత్రం నుంచి హే మామా బ్రష్షే వేస్కో(Brush Vesko).. మైండంతా రిఫ్రెష్ చేస్కో అంటూ సాగే హుషారైన సాంగ్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్. హారిస్ జయరాజ్ సంగీతం అందించగా సరస్వతిపుత్ర రామజోగయ్యశాస్త్రి లిరిక్స్ అందించారు. ఎట్టా చూస్తావ్ ఎగ్‌లోని చికెన్‌ను, ఇప్పుడే అయ్యాను లైఫ్‌లోకి లాగిను.. ఇప్పుడే పెట్టమాకు రిజల్ట్ ఏంటని టెన్షను. అనే లిరిక్స్ చాలా క్యాచీగా ఉన్నాయి. నేను ఏం అవుతానో నాకే తెలుసు, దిల్లంతా డల్ అయ్యేలా ఎన్నో కామెంట్స్ అంటూ సాగే ఈ పాట మంచి మోటివేషన్‌లా ఉంది. ఇక ఈ చిత్రంలో డాక్టర్ రాజశేఖర్, సుదేవ్ నాయర్, రావు రమేశ్, రోహిణి, బ్రహ్మాజీ, అజయ్, హర్ష వర్ధన్, అన్నపూర్ణమ్మ, పవిత్ర నరేశ్, హైపర్ ఆది, హరితేజ, పృథ్వీ తదితరులు నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన డేంజర్ పిల్లా అనే సాంగ్ సూపర్ డూపర్ హిట్టయిన విషయం తెలిసిందే.