పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు ఒక్క హిట్ పడితే చూడాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. సలార్‌తో ప్రభాస్ సాలిడ్ హిట్ కొట్టడం ఖాయమని ఫిక్స్ అయిపోయారు. అయితే.. తాజాగా ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. ఈ విషయంలో మరో ట్విస్ట్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది.
గతంలో సలార్ టీజర్ (Salaar teaser) రిలీజ్ చేస్తానని.. తెగ ఊరించిన ప్రశాంత్ నీల్.. తీరా గ్లింప్స్ రిలీజ్ చేసి టీజర్ అని చెప్పేశాడు. ఇక ఇప్పుడు ట్రైలర్ అని చెప్పి టీజర్ రిలీజ్ చేస్తున్నట్టుగా ఉంది వ్యవహారం. గతంలో సింపుల్ ఇంగ్లీష్ అంటూ.. ఒకే ఒక్క డైలాగ్‌తో రిలీజ్ అయిన సలార్ టీజర్ దెబ్బకు డిజిటల్ రికార్డ్స్ అన్ని చెల్లా చెదురు అయిపోయాయి. ఇక ఇప్పుడు రాబోయే ట్రైలర్(Trailer)తో ఇప్పటి వరకున్న డిజిటల్ రికార్డ్స్ ఒక్కటి కూడా మిగలవని ఫిక్స్ అయిపోయారు. ఇప్పటికే హోంబలే వారు ట్రైలర్ అనౌన్స్మెంట్ లోడింగ్ అంటూ.. పోస్టర్ కూడా వేయడంతో ఈగర్(Eager)గా వెయిట్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. మేకర్స్ ఇచ్చిన లీకుల ప్రకారం డిసెంబర్ 1న సలార్ ట్రైలర్ రిలీజ్ కానుందని తెలుస్తోంది. లేదంటే.. ఇంకాస్త ముందే రిలీజ్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు.
కానీ.. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. సలార్ ట్రైలర్ షాకింగ్ ట్విస్ట్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మామూలుగా అయితే.. పాన్ ఇండియా సినిమాలను ఎన్ని భాషల్లో రిలీజ్ చేస్తే.. అన్ని భాషల్లో ట్రైలర్ రిలీజ్ చేస్తారు. కానీ సలార్ మాత్రం అలా కాదట. టీజర్ తరహాలోనే సింగిల్ లాంగ్వేజ్‌లో ట్రైలర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట ప్రశాంత్ నీల్ (Prashanth Neil). వరల్డ్ వైడ్ రీచ్ ఉండేలా.. కేవలం ఒక్క భాషలోనే ట్రైలర్ రిలీజ్ (Trailer release) చేయనున్నారట. ఇలా చేయడం వల్ల ట్రైలర్ కనీవినీ డిజిటల్ రికార్డ్స్ క్రియేట్ చేయడం గ్యారేంటీ. కానీ సింగిల్ లాంగ్వేజ్ అనేసరికి.. ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు. అలాగే.. తక్కువ రన్ టైంతో ట్రైలర్ రిలీజ్ చేస్తారా? అనే డౌట్స్ వస్తున్నాయి. అసలు ప్రశాంత్ నీల్ టార్గెట్ ఏంటనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు. మరి సలార్ ట్రైలర్ విషయంలో క్లారిటీ రావాలంటే.. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే!