ఇటీవలనే పెళ్లి చేసుకున్న బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా భర్త లేకుండానే మాల్దీవుల టూరుకు వెళ్లింది. అయితే పెళ్లి తర్వాత హనీమూన్‌ను వెళ్లాల్సింది పోయి తన స్నేహితురాళ్లతో కలిసి మాల్దీవులకు వెళ్లడంపై అనేక మంది పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. అసలు ఏమైంది ఈ జంటకు అని ప్రశ్నిస్తున్నారు.
Parineeti Chopra left her husband and went to Maldives netizens comments
ఇటీవలే రాజస్థాన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌లో రాఘవ్ చద్దాను వివాహం చేసుకున్న పరిణీతి చోప్రా విహారయాత్ర కోసం మాల్దీవులకు వెళ్లింది. అంతేకాదు అక్కడి నుంచి దిగిన ఆమె సింగిల్ గా ఫొటోను షేర్ చేసింది. అయితే పరిణీతి చోప్రా(Parineeti Chopra) మాత్రం తన భర్తతో కలిసి మాల్దీవులకు వెళ్లలేదు. హనీమూన్ ప్లాన్ వదిలేసి తన గర్ల్ గ్యాంగ్ తో కలిసి విహారయాత్రకు వెళ్లింది. అక్కడి నుంచి లుక్‌ని పరిణీతి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. పరిణీతి తాను బస చేసిన రిసార్ట్ ఫోటోను మరో ఫోటోతో పంచుకుంది. అక్కడ వారితో ఉదయం కాఫీని ఆస్వాదిస్తున్నట్లు తెలిపింది. ఈ చిత్రంలో నటి కనిపించనప్పటికీ, పరిణీతి పింక్ వెడ్డింగ్ గాజులు స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే ఆ ఫోటోలు నా హనీమూన్‌లో కాదు. అనే హ్యాష్‌ట్యాగ్ గర్ల్స్ ట్రిప్‌తో వచ్చాననే క్యాప్షన్ కూడా ఇచ్చింది. పెళ్లి తర్వాత ఎవరైనా భర్తతో కలిసి హనీమూన్ కి రావాలని అనుకుంటారు. కానీ పరిణితి ఇలా ఫ్రెండ్స్ తో రావడం అందరికీ అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
ఇక ఆమె తన పర్యటనను ప్రారంభించే ముందు పరిణీతి ఢిల్లీ(delhi)లోని లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్ వాక్ చేసింది. పెళ్లి తర్వాత తొలిసారి షో స్టాపర్‌గా ర్యాంప్ వాక్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది పరిణీతి. అందంగా చీరకట్టుకుని నుదిటిపై కుంకుమతో చాలా అందంగా కనపడింది. పరిణీతి చివరిగా అక్షయ్ కుమార్ నటించిన మిషన్ రాణిగంజ్‌లో కనిపించింది. ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.