»Pakistan Prime Minister Of Pakistan Has Promised Financial Assistance To Maldives
Pakistan: మాల్దీవులకు ఆర్థిక సాయం చేస్తామని పాక్ ప్రధాని హామీ
భారత్‌ను వ్యతిరేకిస్తున్న మాల్దీవులకు సాయం చేసేందుకు పాకిస్థాన్ ముందుకు వచ్చింది. పాకిస్థాన్ తాత్కాలిక ప్రధాని అన్వరుల్ హక్ కకర్ మాల్దీవుల అభివృద్ధికి ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.
Pakistan: మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ అధ్యక్షుడైనప్పటి నుంచి భారత్‌కు వ్యతిరేకంగా ఉంటున్నారు. మాల్దీవుల్లో మోహరించిన భారత సైన్యాన్ని కూడా తిరిగి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికోసం ఒక ప్రతినిధి బృందం భారత్‌కు వచ్చి చర్చలు చేస్తుంది. అయితే మరోవైపు భారత్‌ను వ్యతిరేకిస్తున్న మాల్దీవులకు సాయం చేసేందుకు పాకిస్థాన్ ముందుకు వచ్చింది. పాకిస్థాన్ తాత్కాలిక ప్రధాని అన్వరుల్ హక్ కకర్ మాల్దీవుల అభివృద్ధికి ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. భారతదేశంతో ఉద్రిక్తత మధ్య పొరుగు దేశం పాకిస్తాన్ మాల్దీవులకు మద్దతుగా ముందుకు వచ్చింది. మాల్దీవుల అభివృద్ధి పనుల్లో సాయం చేస్తామని పాకిస్థాన్ హామీ ఇచ్చింది. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజుతో ఫోన్ కాల్లో పాకిస్థాన్ తాత్కాలిక ప్రధాన మంత్రి అన్వరుల్ హక్ కాకర్ చర్చించారు.
మాల్దీవులు- పాకిస్తాన్ మధ్య దౌత్య సంబంధాలు 26 జూలై 1966న ఏర్పాటయ్యాయి. రెండు దేశాల మధ్య మరో బలమైన బంధం చైనా.. ఒక రకంగా చెప్పాలంటే, పాకిస్తాన్‌ను చైనాకు ఎవర్గ్రీన్ ఫ్రెండ్‌గా పరిగణిస్తారు.. అయితే మాల్దీవుల అధ్యక్షుడు ముయిజు కూడా చైనాకు మద్దతుదారుడిగా ఉన్నారు. ఇక, రోజు రోజుకు పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ క్షీణించి ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతుంది.. అలాంటి పాకిస్తాన్- మాల్దీవులకు సహాయం చేస్తానంటూ హామీ ఇవ్వడం నిజంగా హస్యస్పదంగా ఉంది. ఇక, భారతీయ పర్యాటకులు మాల్దీవులను బహిష్కరించడంతో ఆ దేశ పర్యాటక రంగం తీవ్ర ఇబ్బందులు పడుతుంది.