»Mohammad Muizzu Black Magic On The President Of Maldives Two Ministers Arrested
Mohammad Muizzu: మాల్దీవులు అధ్యక్షుడిపై చేతబడి.. ఇద్దరు మంత్రులు అరెస్ట్
మాల్దీవులు అధ్యక్షుడు ముయిజ్జుపై చేతబడి చేశారనే ఆరోపణలతో ఇద్దరు మంత్రులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ దేశంలో పర్యావరణ శాఖలో సహాయమంత్రిగా నిధులు నిర్వహిస్తున్న షమ్నాజ్ సలీం ఆమె మాజీ భర్త మంత్రి ఆదం రమీజ్ను పోలీసులు అరెస్టు చేశారు.
Mohammad Muizzu: Black magic on the President of Maldives.. Two ministers arrested
Mohammad Muizzu: మాల్దీవులు అధ్యక్షుడు ముయిజ్జుపై చేతబడి చేశారనే ఆరోపణలతో ఇద్దరు మంత్రులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ దేశంలో పర్యావరణ శాఖలో సహాయమంత్రిగా నిధులు నిర్వహిస్తున్న షమ్నాజ్ సలీం ఆమె మాజీ భర్త మంత్రి ఆదం రమీజ్ను పోలీసులు అరెస్టు చేశారు. వీళ్లతో పాటు మరో ఇద్దరిని కూడా అరెస్టు చేసి ఏడు రోజుల కస్టడీ రిమాండు విధించారు. ఆమెను పర్యావరణ శాఖ మంత్రి పదవి నుంచి తొలగించారు. అలాగే రమీజ్ను కూడా పదవి నుంచి తప్పించారని నెట్టింట్ వైరల్ అవుతోంది.
గతంలో ముయిజ్జు మాలె సిటీ మేయర్గా విధులు నిర్వహించినప్పుడు షమ్నాజ్, రమీజ్ కౌన్సిలర్లుగా ఆయనతో కలిసి పనిచేశారు. అయితే మాల్దీవులు ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. మాల్దీవుల్లో చేతబడి నేరం కాదు. కానీ, ఇస్లామిక్ చట్టాల ప్రకారం దోషిగా నిర్దారణ అయితే ఆరు నెలల జైలు శిక్ష విధిస్తారు. చేతబడి ఆ దేశంలో సర్వసాధారణం. ముయిజ్జును అంతం చేయడానికే చేతబడి ప్రయోగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.