తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివసిస్తున్న ఇంటి సమీపంలో క్షుద్రపూజలు స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Black magic: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంటి సమీపంలో క్షుద్రపూజలు స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నం 14 నందినగర్‌లో కేసీఆర్ నివాసం ఉంటున్న విషయం తెలిసిందే. ఇక్కడే మంగళవారం రాత్రి బ్లాక్ మ్యాజిక్ జరిగిందని స్థానికులు గుర్తించారు. ఈ వార్త అందిరలో కలవరాన్ని సృష్టించింది. దీంతో ఆందోళన చెందిన స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ ప్రదేశాన్ని గమనించారు. కేసీఆర్ ఇంటి సమీపంలో ఓ ఖాలీ ప్లాట్ ఉంది. అక్కడే మంగళవారం మధ్యహ్నం సమయంలో కొంత మంది కనిపించారని చూసిన వారు చెప్పారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ ఖాళీ ప్రదేశంలో ఒక బొమ్మ, దానికి మొత్తం పసుపు, కుంకుమతో పూశారు. పక్కనే ఎర్రటి వస్త్రం అందులో నిమ్మకాయలు, మిరపకాయలు, వెంట్రుకలు, బియ్యం ఇతర సామగ్రిని గుర్తించామని పోలీసులు తెలిపారు. స్థానికులను విచారించిన పోలీసులు ఆ ఖాళీ స్థలంలో సోమవారం అర్థరాత్రి కొంత మంది యువకులు కన్పించినట్లు వెల్లడించారు. అయితే ఇదంత ఆ ప్లాట్ కోసం చేసిన పనా లేదా ఎవరైనా అకతాయిల చేసిన పనా అనే కోణంలో విచారణ సాగుతోంది. ఈ వ్యవహారంతో లోతుగా దర్యాప్తు చేపట్టాలని స్థానికులు పోలీసులకు డిమాండ్ చేస్తున్నారు. చుట్టు ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించనున్నారు.