ట్రిపుల్ ఆర్తో గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. నెక్స్ట్ దేవర పాన్ ఇండియా లెవల్లో భారీగా ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నాడు. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నాడు. తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ షెడ్యూల్ ఇదే అంటున్నారు.
War 2: ప్రజెంట్ దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (ntr). కొరటాల శివ భారీ యాక్షన్స్ ఎపిసోడ్స్ తెరకెక్కిస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న దేవర (devara) ఫస్ట్ పార్ట్ రిలీజ్ కానుంది. దీంతో వీలైనంత త్వరగా దేవర షూటింగ్ కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు ఎన్టీఆర్. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నాడు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా వార్2 తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రజెంట్ హీరోలు లేకుండా షూటింగ్ చేస్తున్నాడు దర్శకుడు అయాన్ ముఖర్జీ. ఇటీవలే స్పెయిన్‌లో ఈ సినిమాకు సంబంధించిన ఓ భారీ షెడ్యూల్ కంప్లీట్ చేశారు. త్వరలోనే హృతిక్ రోషన్ ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఎన్టీఆర్ కూడా ఈ ఏడాదిలోనే వార్ 2 సెట్స్‌లోకి ఎంట్రీ ఇస్తాడని అనుకున్నారు. నవంబర్ లేదా డిసెంబర్లో వార్2లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉందని అన్నారు. కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టబోతున్నారట ఎన్టీఆర్.
ముందుగా తారక్ పై భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట. యాక్షన్ ఎపిపోడ్‌లో హృతిక్‌రోషన్ కూడా పాల్గొంటారని సమాచారం. నెలరోజుల పాటు జరిగే నాన్‌స్టాప్ షెడ్యూల్లో ఎన్టీఆర్‌పై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించబోతున్నారని తెలిసింది. ఫిబ్రవరిలోగా దేవర షూటింగ్ పూర్తి చేసుకొని.. ‘వార్ 2’ సెట్స్‌లో జాయిన్ కావడానికి రెడీ అవుతున్నాడు ఎన్టీఆర్. మరి వార్2తో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.