గేమ్ చేంజర్ లీకులను.. ఇక అపలేరు అన్నట్టుగానే ఉంది వ్యవహారం. నిర్మాత దిల్ రాజు ఎన్ని విధాలుగా ట్రై చేసిన గేమ్ చేంజర్ షూటింగ్ నుంచి లీకులు మాత్రం ఆగడం లేదు. లేటెస్ట్ మైసూర్ షెడ్యూల్లో కూడా ఓ వీడియో లీక్ అయింది.
Game Changer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న పవర్ ఫుల్ పొలిటికల్ యాక్షన్ డ్రామా గేమ్ చేంజర్ (Game Changer). ఇండియన్ 2 వల్ల ఈ సినిమా షూటింగ్ డిలే అవుతూ వస్తోంది. ఎట్టకేలకు కొంత గ్యాప్ తర్వాత మైసూర్లో గేమ్ చేంజర్ షూటింగ్ మొదలు పెట్టాడు శంకర్. ఇక షూటింగ్ స్టార్ట్ చేయడమే లేట్ అన్నట్టుగా.. వెంటనే గేమ్ చేంజర్ షూటింగ్ వీడియో ఒకటి లీక్ అయ్యింది. అందులో చరణ్ (Charan).. ఐఏఎస్ ఆఫీసర్‌గా బ్లాక్ కలర్ సూట్లో క్లాస్‌గా కనిపించాడు. దీంతో.. ఈ వీడియో ఎలా లీక్ అయ్యిందో తెలియదు కానీ.. మెగాభిమానులు మాత్రం లీక్ చేసినవారిపై ఫైర్ అవుతున్నారు.
అసలు ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి ఎన్నో లీకులు బయటికి వచ్చాయి. లీకైన ప్రతిసారి గట్టి చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు మేకర్స్. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. లీక్స్ జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ షూటింగ్ జరుగుతుందో తెలుసుకొని మరీ లీకు రాయుళ్లు.. లీకులు చేస్తున్నారు. ఒక్క గేమ్ చేంజర్ అనే కాదు.. గుంటూరు కారం, పుష్ప విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఇలా చేయడం వల్ల సినిమాలో చూడాలనుకుంటున్న సర్ప్రైజ్ ఎలిమెంట్స్ పెద్దగా కిక్ ఇవ్వవు. అంతేకాదు.. లీకుల వల్ల సినిమా పై ఇంట్రెస్ట్ కూడా తగ్గే ఛాన్స్ ఉంది. కాబట్టి.. ఇప్పటికైనా గేమ్ చేంజర్ మేకర్స్ లీకులపై జాగ్రత్తలు తీసకుంటే బెటర్. కానీ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నప్పటికీ.. లీకుల్ని ఆపడం కష్టంగానే కనిపిస్తోంది. ఇకపోతే.. చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా.. దిల్ రాజ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.