»Singareni Elections In Telangana Postponed For December 27th 2023
Telangana:లో ఎన్నికలు వాయిదా..కారణమిదే
తెలంగాణలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) గుర్తింపు పొందిన కార్మిక సంఘం ఎన్నికలు మళ్లీ వాయిదా పడ్డాయి. ఈనెల 28న నిర్వహించాల్సిన ఎన్నికలు డిసెంబర్ నెలకు పోస్ట్ పోన్ అయ్యాయి. అయితే ఎందుకనేది ఇప్పుడు చుద్దాం.
singareni Elections in Telangana postponed for december 27th 2023
తెలంగాణ(telangana)లో సింగరేణి ఎన్నికలు(singareni Elections) మళ్లీ వాయిదా పడ్డాయి. గతంలో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ ఎన్నికలను అక్టోబర్ 30లోపు నిర్వహించాలని ఇటివల తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఆ క్రమంలో ఇప్పటికే కేంద్ర కార్మికశాఖ కూడా ఎన్నికలు జరిపేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కావడంతో సింగరేణి యాజామాన్యం ఈ ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఎన్నికలను వాయిదా వేయాలని తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో సింగరేణి ఎన్నికలు డిసెంబర్ 27కు వాయిదా పడ్డాయి.
రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సన్నాహాల్లో పోలీసులు, జిల్లా అధికారులు నిమగ్నమై ఉంటారని, ఈ దశలో ఎన్నికల నిర్వహణపై సింగరేణి యాజమాన్యం నిస్సహాయత వ్యక్తం చేసింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో మొత్తం పోలీసు బలగాలు, జిల్లా యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. కాబట్టి దాదాపు 42 వేల మంది బొగ్గు గని కార్మికులు, ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేసి సింగరేణి కార్మికుల సంఘానికి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాకపోవచ్చని సింగరేణి కాలరీస్(SCCL) సీనియర్ అధికారి తెలిపారు.
మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని తాము కేంద్ర కార్మిక శాఖను అభ్యర్థించామని టీజీబీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి తెలిపారు. అయినప్పటికీ సింగరేణి ట్రేడ్ యూనియన్‌కు ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేయాలని సీఎల్‌డీసీ(CLDC) నిర్ణయించిందని గుర్తు చేశారు. అయితే తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకే కేంద్ర కార్మిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసిందని సింగరేణి యాజమాన్యానికి సీడీఎల్సీ స్పష్టం చేసింది. సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు(high court) సెప్టెంబర్ 25వ తేదీన ట్రేడ్ యూనియన్‌కు అక్టోబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని తీర్పునిచ్చింది.