సీనియర్ ఐపీఎస్ అధికారి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రి విజయ రామారావు (85) (K Vijaya Rama Rao, Rtd IPS) ఆకస్మిక మరణం పొందారు. సోమవారం బ్రెయిన్ స్ట్రోక్ (Brain Stroke) రావడంతో కుటుంబసభ్యులు వెంటనే జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి (Apolo Hospital)కి తరలించారు. అతడికి అత్యవసర వైద్య సేవలు అందిస్తుండగా పరిస్థితి విషమించి ఆయన చనిపోయారు. అతడి మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (K Chandrashekar Rao), టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తదితరులు సంతాపం ప్రకటించారు.
తెలంగాణ (Telangana)లోని ములుగు జిల్లా (Mulugu District) ఏటూరు నాగారంలో 1937 ఏప్రిల్ 4న జన్మించిన విజయ రామారావు చదువు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో సాగింది. మద్రాసు విశ్వవిద్యాలయంలో బీఏ చదివారు. అనంతరం1957లో ఐపీఎస్ గా ఎంపికయ్యారు. అనంతరం కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాలలో అధ్యాపకుడిగా చేరారు. పోలీస్ అధికారిగా కీలక కేసుల్లో విజయరామారావు ఉన్నారు. బాబ్రీ మసీదు, హవలా కుంభకోణం, ముంబై పేలుళ్ల వంటి కేసులను చేధించారు. 36 ఏళ్ల పాటు అధికారికగా సేవలందించిన విజయరామారావు అనంతరం రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. తెలుగుదేశం పార్టీలో చేరి 1999లో హైదరాబాద్ లోని ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను గెలిపించి సత్తా చాటడంతో అతడిని నాటి సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇచ్చారు. స్వరాష్ట్రం తెలంగాణ ఏర్పడిన అనంతరం ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
కాగా ఆయన భార్య గతేడాది మరణించగా.. వారికి కుమారులు శ్రీనివాస కల్యాణ్, ప్రసాద రావు, కూతురు అన్నపూర్ణ ఉన్నారు. బ్రెయిడ్ డెడ్ కావడంతో తీవ్ర రక్తస్రావం జరిగి శరీరం లోపల అన్ని అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చికిత్స పొందుతూ సోమవాం రాత్రి కన్నుమూశారు. ఆయన మృతికి తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, చామారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. కాగా మంగళవారం సాయంత్రం విజయ రామారావు అంత్యక్రియలు జరుగనున్నాయి. అయితే విజయ రామారావు చేసిన సేవలకు గాను ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది.