»Revanth Reddy Challenge To Ktr Kcr Ktr Got Positions Because Of Congress
Revanth Reddy: KTRకు రేవంత్ సవాల్..కాంగ్రెస్ వల్లే మీకు పదవులు వచ్చాయ్
మంత్రి కేటీఆర్(KTR) కామారెడ్డి జిల్లా పిట్లంలో కాంగ్రెస్ పార్టీపై చేరిన ఆరోపణలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్(congress party), బీఆర్ఎస్(BRS) హాయంలో జరిగిన అభివృద్ధిపై కేటీఆర్ చర్చకు రావాలని రేవంత్ సవాల్ విసిరారు. అసలు తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీనని గుర్తు చేశారు. కాంగ్రెస్ తెలంగాణ(telangana) ఇవ్వకపోతే కేటీఆర్ అమెరికాలో కూలీగా పనిచేసేవాడని ఎద్దేవా చేశారు.
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(ktr) కామారెడ్డి(kamareddy) జిల్లా పిట్లంలో కాంగ్రెస్ పార్టీపై చేరిన ఆరోపణలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) స్పందించారు. 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయలేదని.. ఈ క్రమంలో మరోసారి అవకాశం ఇవ్వాలని అడగడం విడ్డూరంగా ఉందని కేటీఆర్ అన్నారు. దీనిపై నిజామాబాద్లో(nizamabad) రేవంత్ రెడ్డి పర్యటించిన సందర్భంగా కేటీఆర్ కు సవాల్ విసిరారు. తెలంగాణ(telangana)లో అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీనేనని రేవంత్ అన్నారు.
మరోవైపు కేటీఆర్(KTR), కేసీఆర్(kcr) చదువుకున్న స్కూళ్లు(schools) నిర్మించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని(congress government) రేవంత్ అన్నారు. అంతేకాదు తెలంగాణను ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే కేసీఆర్, కేటీఆర్ లకు పదవులు వచ్చాయని గుర్తు చేశారు. అసలు కామారెడ్డి జిల్లాతోపాటు తెలంగాణలో 30 వేల స్కూల్స్, వెయ్యి జూనియర్ కాలేజీలు, 11 యూనివర్సిటీలు సహా అనేక కార్యక్రమాలు చేశామని రేవంత్ అన్నారు. మీరు ఇచ్చిన హామీ తెలంగాణలో 24 గంటల కరెంటు ఇస్తున్నామని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని రేవంత్(Revanth Reddy) కేటీఆర్ కు సవాల్ చేశారు. అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వం(Congress), బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై కూడా చర్చకు రావాలని కోరారు.
తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం(congress government) ఇచ్చిన చేసిన తర్వాతే మీకు ఉన్నత పదవులను వచ్చాయని రేవంత్ అన్నారు. లేకుంటే కేటీఆర్ యూఎస్ఏలో పనిమనిషిగా పనిచేసి ఉండేవారని ఎద్దేవా చేశారు. కాగా, రేవంత్ రెడ్డి తన శిబిరంలో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన పెద్దలతో సమావేశమయ్యారు. దుబ్బాక, హమాల్వాడి, దేవిరోడ్డు, పూసలగల్లి, గోలె హనుమాన్ మీదుగా నడిచి నెహ్రూపార్కుకు చేరుకుని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
మరోవైపు గౌతమ్ అదానీ వ్యవహారాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) విచారణ జరిపించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్ రెడ్డి(Revanth Reddy) డిమాండ్ చేశారు. న్యూఢిల్లీలో ప్రతిపక్ష ఎంపీలను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. యూపీఏ హయాంలో బొగ్గు గనులు, 2జీ, కామన్వెల్త్ గేమ్స్ వంటి అంశాలపై JPC విచారణ జరిపిందని చెప్పారు.