»Perni Nani Sawal To Chandrababu Naidu And Pawan Kalyan Courage To Compete In Pulivendu
Perni Nani: చంద్రబాబు, పవన్ కు పులివెందులలో పోటీ చేసే ధైర్యముందా?
ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పోటీ చేయాలని మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని(perni nani) సవాల్ విసిరారు. అంతేకాదు ధైర్యముంటే పులివెందుల(Pulivendula)లో సీఎం జగన్(cm jagan)కు పోటీగా పవన్(pawan kalyan) లేదా చంద్రబాబు(chandrababu naidu) పోటీ చేయాలని సవాల్ చేశారు.
AP సీఎం జగన్‌తో పోటీ చేసే ధైర్యం చంద్రబాబు(chandrababu naidu)కు లేదని మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని(perni nani) అభిప్రాయపడ్డారు. పొత్తులు లేకుండా ఎన్నికల్లో పోటీ చేయలేరని అన్నారు. ఈ క్రమంలో పులివెందుల(Pulivendula)లో చంద్రబాబు లేదా పవన్‌కల్యాణ్(pawan kalyan) పోటీ చేయాలని సవాల్ చేశారు. మీకు సవాల్ స్వీకరించే ధైర్యం ఉందా అంటూ ప్రశ్నించారు. నాలుగు సీట్లు గెలిస్తేనే ఎందుకింత సంబరమని ఎద్దేవా చేశారు. అప్పడే ప్రపంచాన్ని జయించినట్లు ఫీల్ అవుతున్నారని దుయ్యబట్టారు. ఈ క్రమంలో త్వరలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటమిని రుచి చూస్తుందని నాని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భాగంగా పేర్ని ఈ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పోటీ చేయాలని పేర్ని నాని సవాల్ విసిరారు. అలాగే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై(ys jaganmohan reddy) పోటీ చేయగలరా అని చంద్రబాబు, పవన్‌కు సవాల్ విసిరారు. 175 నియోజకవర్గాల్లో జనసేనకు ఎన్ని టిక్కెట్లు ఇస్తారో టీడీపీ(TDP) స్పష్టం చేయాలని కోరారు. రాహుల్ గాంధీకి కూడా టీడీపీ టిక్కెట్ ఇస్తుందా అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలతో కలిసి పోటీ చేసినా కూడా టీడీపీ వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమని విమర్శించారు.
ఏపీ సీఎం జగన్(ap cm jagan) మోహన్ రెడ్డి చేసే ప్రతి పైసాకు లెక్క ఉందని వెల్లడించారు. తప్పుడు ప్రకటనలు కాకుండా నిజాయితీతో రాజకీయాలు చేయాలని నాని ప్రతిపక్ష నేతలకు హితవు పలికారు. ఈ క్రమంలో టీడీపీకి టచ్ లో 40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారన్న అంశంపై కూడా స్పందించారు. స్క్రాప్ ఏమైనా ఉంటే తీసుకెళ్లవచ్చని వ్యాఖ్యానించారు. అంతేకాదు మగవాళ్లు మగవాళ్లు టచ్ లో ఎందుకు ఉంటారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.