వివిధ కేటగిరిల్లోనూ ఈ నివేదికను ఏడీఆర్ తయారు చేస్తుంది. ఏడీఆర్ నివేదికను పరిశీలిస్తుంటే అత్యంత సంపన్న పార్టీగా బీజేపీ నిలుస్తోంది. ఢిల్లీ తర్వాత మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక నుంచి అత్యధికంగా బీజేపీ విరాళాలు వస్తున్నాయి. ఢిల్లీ మినహా ప్రస్తుతం మూడు రాష్ట్రాల్లో బీజేపీనే అధికారంలో ఉంది. దీంతో అక్కడి నుంచే అధిక విరాళాలు వస్తున్నాయి. కాగా తాజా నివేదికపై రాజకీయ దుమారం రేగింది.
టర్కీ, సిరియాలో భూకంపం కారణంగా ఇబ్బందులు పడుతున్న బాధితులకు ప్రముఖ చెఫ్ నస్ర్-ఎట్ గోక్సే ప్రతి రోజు 5 వేల మందికి ఉచితంగా ఆహారం అందిస్తున్నట్లు తన ఇన్ స్టా వేదికగా వెల్లడించారు. సాల్ట్ బే(salt bae)గా ఫేమస్ అయిన ఈ చెఫ్ చేస్తున్న సాయం పట్ల పలువురు మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.
గంగా జమున తహసీబ్ తరహాలో అందరూ కలిసిమెలిసి జీవిస్తేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతుంది. అన్ని మతాల పండుగలను ప్రజలు సంతోషంగా చేసుకునేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ సందర్భంగా తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగ సంఘం నాయకులు కవితకు వినతిపత్రం ఇచ్చారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కవిత హామీ ఇచ్చారు.
నిన్నటి గెలుపుతో టెస్టుల్లోను ఆస్ట్రేలియాను దాటిందని ఐసీసీ వెబ్ సైట్ చూపించింది. అయితే ఐసీసీ వెబ్ సైట్ సాంకేతిక సమస్య కారణంగా భారత్ టెస్టుల్లోను అగ్రస్థానానికి చేరుకుంది. నిజానికి ఆస్ట్రేలియాను ముందు నిలిచింది. దీనిని గుర్తించిన ఐసీసీ తన వెబ్ సైట్‌ను కరెక్ట్ చేసింది.
ఈరోజే త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతుంది. 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై..రాత్రి ఏడు గంటల వరకు కొనసాగనుంది. మార్చి 2న ఓట్ల లెక్కింపు ఫలితాలను ప్రకటించనున్నారు.
ysr statue:వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల (sharmila) ప్రజా ప్రస్థాన యాత్ర పాలకుర్తి నియోజకవర్గంలో జరుగుతోంది. రేపు అవుతాపురం గ్రామంలో 3800 కిలోమీటర్ల మైలురాయిని చేరుకోనుంది. ఈ సందర్భంగా అక్కడ వైఎస్ఆర్ విగ్రహాం (ysr statue) ఏర్పాటు చేశారు. దీనిపై వైఎస్ఆర్ టీపీ (ysrtp), బీఆర్ఎస్ (brs) కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. అక్కడున్న మహిళలు వారిని అడ్డుకున్నారు.
Chandhra Babu Naidu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు కి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని మరో వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో చంద్రబాబు ప్రయాణిస్తున్న కారు బంపర్ ద్వంసమయ్యింది.
KA Paul : ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఎప్పుడో కానీ... మీడియా ముందుకు రాని ఆయన ఈ మధ్య... అధికార పార్టీని, పలువురు నేతలను టార్గెట్లు చేస్తూ స్టేట్మేంట్స్ ఇస్తున్నారు. తాజాగా... తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం గురించి కూడా తనదైన శైలిలో విమర్శలు గుపించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం లో అతి త్వరలో కవితను అరెస్ట్ చేస్తారని, సీఆర్ దేశ్ కీ నేత అ...
ఇండియా పురుషుల క్రికెట్ జట్టు అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. తాజాగా ICC టెస్ట్ ర్యాంకింగ్స్ లలో మెన్స్ టీమిండియా జట్టు అన్ని ఫార్మాట్లలో ఐసీసీ వరల్డ్ నంబర్ వన్ జట్టుగా నిలిచింది.
Komati Reddy Vs Revanth Reddy : ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన కామెంట్స్... తెలంగాణ కాంగ్రెస్ లో తీవ్ర కలకలం రేపాయి. ఆయన కామెంట్స్ కి సర్దుబాటు చర్యల్లో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. కాగా తాజాగా... కోమటిరెడ్డి కామెంట్స్ పై రేవంత్ రెడ్డి స్పందించారు. పార్టీకి నష్టం కలిగించేలా ఎవరు మాట్లాడినా ఉపేక్షించబోమన్నారు.
దేశంలో సెట్ టాప్ బాక్స్ లేకుండా వినియోగదారులు ఉచితంగా 200+ టీవీ ఛానెళ్లు వీక్షించే సౌకర్యం తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.
Latest News : మద్యం తాగడం విషయంలో పోటీ పెట్టుకొని ఓ వ్యక్తి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పూర్తివివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్ కి చెందిన 45ఏళ్ల జై సింగ్ అనే వ్యక్తి తన ఇద్దరు స్నేహితులతో ఛాలెంజ్ పెట్టుకున్నాడు. కేవలం 10 నిమిషాల్లో లోకల్ మందును మూడు క్వార్టర్లు తాగాలంటూ ఛాలెంజ్ చేశారు. తాగకపోతే... ఆరోజు వారు తాగిన మందు బిల్లు అంతా కట్టాలని వారు బెట...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) బుధవారం కడప స్టీల్ ప్లాంటుకు (Steel plant) భూమిపూజ నిర్వహించారు. జిందాల్ స్టీల్ (Jindal Steel) చైర్మన్ సజ్జన్ జిందాల్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఉక్కు పరిశ్రమ నమూనాను పరిశీలించారు.
టీడీపీ చురుగ్గా కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో అధికార పార్టీకి కంటగింపు మొదలైంది. టీడీపీ కార్యక్రమాలు విజయవంతం కాకుండా అన్ని విధాల ప్రయత్నాలు చేస్తోందని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే లోకేశ్ యాత్రపై అనేక ఆంక్షలు కొనసాగుతున్నాయి. మైక్ లాక్కోవడం.. కార్యకర్తలను రాకుండా అడ్డుకోవడం వంటి చర్యలు ఏపీ ప్రభుత్వం చేస్తోందని టీడీపీ ఆరోపిస్తుంది.
10, 12వ తరగతి బోర్డు పరీక్షల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్‌జిపిటి(ChatGPT)ని ఉపయోగించడాన్ని నిషేధించినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) వెల్లడించింది. విద్యార్థులు ఉపయోగించినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.