»Brs And Ysrtp Workers Are Fight Due To Ysr Statue Establish
ysr statue:వైఎస్ఆర్ విగ్రహా ఏర్పాటుపై కార్యకర్తల మధ్య ఘర్షణ.. అడ్డుకున్న మహిళలు
ysr statue:వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల (sharmila) ప్రజా ప్రస్థాన యాత్ర పాలకుర్తి నియోజకవర్గంలో జరుగుతోంది. రేపు అవుతాపురం గ్రామంలో 3800 కిలోమీటర్ల మైలురాయిని చేరుకోనుంది. ఈ సందర్భంగా అక్కడ వైఎస్ఆర్ విగ్రహాం (ysr statue) ఏర్పాటు చేశారు. దీనిపై వైఎస్ఆర్ టీపీ (ysrtp), బీఆర్ఎస్ (brs) కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. అక్కడున్న మహిళలు వారిని అడ్డుకున్నారు.
ysr statue:వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల (sharmila) ప్రజా ప్రస్థాన యాత్రకు జనం బ్రహ్మారథం పడుతున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో ఆమె యాత్ర కొనసాగుతోంది. రేపు అవుతాపురం గ్రామంలో 3800 కిలోమీటర్ల మైలురాయిని చేరుకోనుంది. ఈ సందర్భంగా అక్కడ వైఎస్ఆర్ విగ్రహాం (ysr statue) ఏర్పాటు చేశారు. దీనిపై వైఎస్ఆర్ టీపీ (ysrtp), బీఆర్ఎస్ (brs) కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. విగ్రహాం ఏర్పాటును అడ్డుకునేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించారు. అక్కడ వైటీపీ కార్యకర్తలు ఉన్నా.. స్థానికంగా గల మహిళలు ఎదురు తిరిగారు.
YSR విగ్రహాన్ని తామే సొంతగా ఏర్పాటు చేసుకుంటున్నామని బీఆర్ఎస్ నేతలపై తిరగబడ్డారు. వైఎస్ఆర్ తమ దేవుడు అని స్థానిక మహిళలు (womans) అంటున్నారు. తాము అందరం YSR పథకాలతో లబ్ది పొందామని తెలిపారు. YSR విగ్రహాన్ని దగ్గరుండి మరి కట్టిస్తామని చెప్పారు. విషయం తెలిసిన షర్మిల వెంటనే అక్కడున్న నేతలకు ఫోన్ చేశారు. అవుతాపూర్ మహిళలతో వీడియో కాల్లో (video call) మాట్లాడారు. ‘మీరు ఏం భయపడకండి మేడం. మేమున్నా.. విగ్రహాం ఏర్పాటు చేస్తాం’ అని స్థానిక మహిళలు అన్నారు.