కామారెడ్డి జిల్లాలోని అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి 141 దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రజావాణిలో అందిన దరఖాస్తులను పెండింగ్లో పెట్టకుండా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అధికారులు జవాబుదారీగా విధులు నిర్వర్తించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు.