BHPL: జిల్లా వ్యాప్తంగా అర్హత కలిగిన దివ్యాంగులకు ఉపకరణాల కోసం దరఖాస్తు గడువును జులై 5 వరకు పొడిగించినట్లు జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరి మంగళవారం ప్రకటించారు. అర్హులైన దివ్యాంగులు నిర్దేశిత తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9652318042 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.