ATP: గుత్తి మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో మంగళవారం పంపిణీ చేస్తున్న ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్ల ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా తనిఖీ చేశారు. ఇంటింటికి తిరుగుతూ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని కమిషనర్ పరిశీలించారు. పింఛన్ల పంపిణీలో సాంకేతిక సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సిబ్బందికి సూచించారు.