KNR: గంగాధర మండలం ఓద్యారంలోని జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు కుడిక్యాల విజయలక్ష్మి(ఎల్ఎఫ్ఎలెచ్ఎం) సోమవారం ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా మండల విద్యా అధికారి ఏనుగు ప్రభాకర్ రావు సోమవారం సన్మానించారు. ఉద్యోగ విరమణ వయసుకే కాని బోధనకు కాదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గర్షకుర్తి హెడ్ మాస్టర్లు శశికాంత్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.