VSP: చైతన్య కళాశాల ప్రాంతంలో కారు విద్యుత్ స్తంబాన్ని ఢీకొన్న ఘటన పీఎంపాలెంలో చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున వర్షంలో అదుపు తప్పడంతో విద్యుత్ స్తంబాన్ని ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో విద్యుత్ స్తంభం విరిగి రోడ్డుపై పడిపోయింది. కారు ముందు భాగం డామేజ్ అయ్యింది. కానీ ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదన్నారు.