»Huge Amount Received Bjp As Donations Says Adr Report
Donations అత్యంత డబ్బులున్న పార్టీ బీజేపీ, డబ్బుల్లేని పార్టీ ఏదంటే..
వివిధ కేటగిరిల్లోనూ ఈ నివేదికను ఏడీఆర్ తయారు చేస్తుంది. ఏడీఆర్ నివేదికను పరిశీలిస్తుంటే అత్యంత సంపన్న పార్టీగా బీజేపీ నిలుస్తోంది. ఢిల్లీ తర్వాత మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక నుంచి అత్యధికంగా బీజేపీ విరాళాలు వస్తున్నాయి. ఢిల్లీ మినహా ప్రస్తుతం మూడు రాష్ట్రాల్లో బీజేపీనే అధికారంలో ఉంది. దీంతో అక్కడి నుంచే అధిక విరాళాలు వస్తున్నాయి. కాగా తాజా నివేదికపై రాజకీయ దుమారం రేగింది.
తొమ్మిదేళ్లు అధికారంలో కొనసాగుతున్న బీజేపీ రాజకీయపరంగా దేశంలోనే బలమైన పార్టీ ఉండగా.. ఆదాయపరంగా కూడా కాషాయ పార్టీ బలంగా ఉంది. దేశంలోనే అత్యధిక విరాళాలు పొందుతున్న పార్టీగా నిలిచింది. విరాళాలు ఎక్కడి నుంచి వస్తున్నా అత్యధికంగా మాత్రం బీజేపీ ఖాతాలోనే పడుతున్నాయి. అందుకే ఆ పార్టీ దేశంలో ధనస్వామ్యాన్ని పెంచి పోషిస్తోంది. జాతీయ పార్టీలకు వచ్చిన విరాళాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) నివేదికను వెలువడించింది. ఈ నివేదికలో అత్యధికంగా బీజేపీకి రూ.614 కోట్లు, కాంగ్రెస్ కు రూ.95 కోట్లు వచ్చాయని పేర్కొంది.
విరాళాల పరంగా 2021-22 ఆర్థిక సంవత్సర నివేదికను పరిశీలిస్తే 31.50 శాతం విరాళాలు పెరిగాయి. గతేడాదితో పోలిస్తే విరాళాలు భారీగా పెరిగాయి. రూ.20 వేలకు పైబడి వచ్చిన విరాళాలకు సంబంధించి ఆయా పార్టీలు నివేదించిన వివరాల ఆధారంగానే ఏడీఆర్ ఈ నివేదికను రూపొందించింది. జాతీయ పార్టీలకు వచ్చిన విరాళాలు మొత్తం 7,141. వాటి విలువ రూ.780.77 కోట్లు. గత సంవత్సరంతో పోలిస్తే 187.03 కోట్లు అధికంగా విరాళాలు వచ్చాయి.
ఇక విరాళాల్లో పార్టీల పరంగా చూస్తే భారతీయ జనతా పార్టీ (BJP)కి రూ.614.52 కోట్లు వచ్చాయి. 4,957 విరాళాల రూపంలో వచ్చిన మొత్తం అది. అధికారంలో ఉండడంతో సహజంగానే వ్యాపార, పారిశ్రామికవేత్తలు, సంస్థలు నిధులను బీజేపీకే అత్యధికంగా అందించాయి. 81 శాతం విరాళాలు కార్పొరేట్, వ్యాపార వర్గాల నుంచి వచ్చాయని.. 19 శాతం వ్యక్తుల నుంచి బీజేపీకి విరాళాలు వచ్చాయని ఏడీఆర్ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. ఇక కాంగ్రెస్ పార్టీ (Congress Party)కి 1,255 విరాళాల ద్వారా రూ.95.45 కోట్లు వచ్చాయి. అంటే బీజేపీతో పోలిస్తే చాలా చాలా తక్కువ విరాళాలు వచ్చాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)కి రూ.58 కోట్లు రాగా.. ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party)కి రూ.44.54 కోట్లు విరాళాలుగా వచ్చాయి. ఇక సీపీఐ (ఎం) పార్టీ CPI (M)కి రూ.2.85 కోట్లు రాగా.. నేషనల్ పీపుల్స్ పార్టీ (NPEP)కి మాత్రం రూ.24.10 లక్షలు వచ్చాయి. బహుజన్ సమాజ్ పార్టీ తమకు రూ.20 వేలకు పైగా ఒక్క విరాళం రాలేదని మాయావతి ప్రకటించారు. దీంతో ఆ పార్టీ పేరు ఎక్కడా కనిపించలేదు. రూ.20 వేల కన్నా తక్కువ విరాళాలు వచ్చిన పార్టీలను పరిగణనలోకి తీసుకోలేదు.
ప్రతియేటా పార్టీల విరాళాల ఈ నివేదికను ఏడీఆర్ రూపొందిస్తుంది. వివిధ కేటగిరిల్లోనూ ఈ నివేదికను ఏడీఆర్ తయారు చేస్తుంది. ఏడీఆర్ నివేదికను పరిశీలిస్తుంటే అత్యంత సంపన్న పార్టీగా బీజేపీ నిలుస్తోంది. ఢిల్లీ తర్వాత మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక నుంచి అత్యధికంగా బీజేపీ విరాళాలు వస్తున్నాయి. ఢిల్లీ మినహా ప్రస్తుతం మూడు రాష్ట్రాల్లో బీజేపీనే అధికారంలో ఉంది. దీంతో అక్కడి నుంచే అధిక విరాళాలు వస్తున్నాయి. కాగా తాజా నివేదికపై రాజకీయ దుమారం రేగింది. బీజేపీ కార్పొరేట్లకు వెన్నుదన్నుగా నిలుస్తోందని విరాళాల వివరాల ఆధారంగా చెప్పవచ్చని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. విరాళాల కోసం కార్పొరేట్లకు సేవ చేయాల్న? అని ఆయా పార్టీల నాయకులు ప్రశ్నిస్తున్నారు.