»How Many Crores Are The First Month Donations To Ayodhya Ram Mandir
Ayodhya: రామ మందిరానికి మొదటి నెల విరాళాలు ఎన్ని కోట్లంటే?
అయోధ్య రామమందిరానికి మొదటి నెలలో విలువైన అభరణాలు, బంగారం, వెండితో పాటు కోట్ల రూపాయల్లో విరళాలు అందాయి. మొదటి నెలలోనే ఇన్ని విరళాలు రావడం సంతోషంగా ఉందని వాటిని ట్రస్టుకు అప్పగిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు.
How many crores are the first month donations to Ayodhya Ram Mandir?
Ayodhya: అయోధ్య రామమందిరా(Ayodhya Ram Mandir)నికి మొదటి నెల వచ్చిన వివరాళ లెక్కలు వెల్లడించారు నిర్వహకులు. అక్కడ రామ్ లల్లా(Ram Lalla)కు ప్రాణప్రతిష్ఠ జరిగి నెల రోజులు పూర్తి అయింది. అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆ తరువాత సామాన్య భక్తులను అనుమతి ఇవ్వడంతో దేశ నలుమూలల నుంచి వేల సంఖ్యలో బాలరాముడిని దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో వారిచ్చిన కానుకలు, విరాళాలు కూడా భారీగా సమర్పించుకున్నారు. నెల రోజుల ఆదాయాన్ని ఆలయ ట్రస్ట్ ప్రకటించింది. ఫస్ట్ నెలలో రూ.25 కోట్ల విలువైన విరాళాలు అందాయని పేర్కొంది. 25 కిలోల బంగారం, వెండి ఆభరణాలతో పాటు చెక్కులు, డీడీలు, నగదు రూపంలో విరాళాలు వచ్చాయని రామాలయ ట్రస్ట్ అధికారి ప్రకాశ్ గుప్తా తెలిపారు. ఇది కేవలం ఆలయ పరిధికి చెందిన విరాళాలు. ఇవే కాకుండా ట్రస్ట్ బ్యాంక్ ఖాతాలో నేరుగా జరిగిన లావాదేవిల గురించి ఆయనకు తెలియదన్నారు.
అయితే ఆలయంలో వినియోగించని వెండి, బంగారంతో చేసిన పాత్రలు, సామగ్రిని భక్తులు విరాళంగా ఇస్తున్నారని తెలిపారు. ఈ ఆదాయాన్ని లెక్కించడానికి ఆలయంలో ఎస్బీఐ నాలుగు ఆటోమేటిక్ హైటెక్నాలజీ కౌంటింగ్ మెషిన్లు ఏర్పాటు చేసిందని అన్నారు. విరాళాలకు సంబంధించిన రసీదులను ఇవ్వడానికి ఆలయంలో 12 డిజిటల్ కౌంటర్లు ఏర్పాటు చేశామని, అంతే కాకుండా విరాళాల కోసం అదనంగా పెట్టెలను ఆలయ ప్రాంగణంలో పెట్టినట్లు ప్రకాశ్ గుప్తా వివరించారు. శ్రీరామనవమి ఉత్సవాల సమయంలో విరాళాలు పెరుగుతాయని వారు అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో దాదాపు 50 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. మొదటి నెలలో 60 లక్షల మందికి పైగా భక్తులు వచ్చారని తెలిపారు. భక్తుల కోరిక మేరకు ఆలయంలో వినియోగించని వెండి, బంగారు పాత్రలను ప్రభుత్వానికి అప్పగించనున్నట్లు రామాలయ ట్రస్ట్ ట్రస్టీ అనిల్ మిశ్రా తెలిపారు.