ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పార్లమెంట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో ఆయన ప్రసంగించారు.
Asaduddin Owaisi: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పార్లమెంట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో ఆయన ప్రసంగించారు. ఆ సమయంలో ఆయన ప్రధాని మోడీపై మండిపడ్డారు. మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఫలానా వర్గానికో, మతానికో లేదా దేశం మొత్తానికి ప్రభుత్వమా? అని ప్రశ్నించారు. దేశానికి మోదీ బాబా అవసరం లేదన్నారు. పార్లమెంటులో రామమందిర నిర్మాణం, జనవరి 22న ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంపై చర్చ సందర్భంగా ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ దేశానికి మతం లేదని నేను నమ్ముతున్నాను, జనవరి 22 నాటికి ఈ ప్రభుత్వం ఒక మతంపై మరో మతం గెలిచిందనే సందేశం ఇవ్వాలనుకుంటుందా..? దేశంలోని 17 కోట్ల మంది ముస్లింలకు ఏం సందేశం ఇస్తున్నారు? నేను బాబర్, జిన్నా లేదా ఔరంగజేబు ప్రతినిధినా..? నేను రామ్‌ని గౌరవిస్తాను కానీ నాథూరామ్ గాడ్సేను ద్వేషిస్తున్నాను ఎందుకంటే అతను హే రామ్ అని చివరి మాటలు చెప్పిన వ్యక్తిని చంపాడు అని అసదుద్దీన్ అన్నారు. 1992 డిసెంబర్ 6న అయోధ్యలోని బాబ్రీ మసీదును రైట్‌వింగ్ సంస్థలు కూల్చివేసిన రోజు తర్వాత దేశంలో అల్లర్లు జరిగాయని ఒవైసీ అన్నారు. యువకులను జైల్లో పెట్టారని, వృద్ధాప్యంలో బయటకు వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రసంగాన్ని ముగించే ముందు ఒవైసీ మాట్లాడుతూ.. ‘బాబ్రీ మసీదు జిందాబాద్.. బాబ్రీ మసీదు ఉంది, శాశ్వతంగా ఉంటుందన్నారు.