»Mohsin Dawar Injured As Security Forces Open Fire
Pakistan: పాకిస్థాన్‌లో ఓట్ల లెక్కింపులో గందరగోళం.. అభ్యర్థిపై కాల్పులు
పొరుగు దేశం పాకిస్థాన్‌లో ఎన్నికలు పూర్తయ్యాయి. అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చే ఫలితాలు విడుదలవుతున్నాయి. ఈ క్రమంలో NA-40 సీట్ అభ్యర్థి, నేషనల్ డెమొక్రాటిక్ మూవ్మెంట్ (NDM) చీఫ్ మొహ్సిన్ దావర్ పాకిస్తాన్‌లోని మిరాన్షాలో రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం వెలుపల భద్రతా బలగాలు కాల్చడంతో గాయపడ్డారు.
Pakistan Election Result : పొరుగు దేశం పాకిస్థాన్‌లో ఎన్నికలు పూర్తయ్యాయి. అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చే ఫలితాలు విడుదలవుతున్నాయి. ఈ క్రమంలో NA-40 సీట్ అభ్యర్థి, నేషనల్ డెమొక్రాటిక్ మూవ్మెంట్ (NDM) చీఫ్ మొహ్సిన్ దావర్ పాకిస్తాన్‌లోని మిరాన్షాలో రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం వెలుపల భద్రతా బలగాలు కాల్చడంతో గాయపడ్డారు. పార్టీ కార్యకర్తలు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి దావర్ ఓటుకు నోటు కేసుకు సంబంధించి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లాలనుకున్నారు. ఇంతలో పోలీసులు, భద్రతా బలగాలు అతనిపై కాల్పులు జరిపారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయం మిరాన్షా కంటోన్మెంట్ లోపల ఉంది.
దావర్ ఎన్‌డిఎం తరపున ఎన్ఎ-40 స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఓట్ల లెక్కింపులో రిగ్గింగ్ జరిగిందని ఆయన ఆరోపించారు. దీంతో ఆయన రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్తున్నారు. పోలీసులు, భద్రతా బలగాలు మొదట దావర్‌ను కార్యాలయంలోకి రాకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత వాగ్వాదం తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. మోహరించిన భద్రతా అధికారులు కాల్పులు జరిపారు. దావర్, అతని మద్దతుదారులలో పలువురు గాయపడ్డారని పార్టీ వర్గాలు ఆరోపించాయి. మిరాన్షా ఆర్వో ఆఫీస్ వెలుపల సంఘటన జరగడానికి కొన్ని గంటల ముందు దావర్ PK-104 అసెంబ్లీ నియోజకవర్గం ఫలితాలు ఇక్బాల్ వజీర్ (PML-N అభ్యర్థి)కి అనుకూలంగా రిగ్గింగ్ అయ్యాయని పేర్కొన్నాడు.
శాంతియుత నిరసనకారులపై జరిగిన అక్రమ దాడిపై తక్షణమే విచారణ జరిపించాలని నేషనల్ డెమోక్రటిక్ మూవ్మెంట్ (NDM) పార్టీ అధికార ప్రతినిధి బుష్రా గోహర్ ట్వీట్లో డిమాండ్ చేశారు. దీంతో పాటు దావర్‌తో పాటు తీవ్రంగా గాయపడిన వారిని పెషావర్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్‌డిఎం పార్టీ మద్దతుదారుల నుండి వస్తున్న వార్తల ప్రకారం.. ఈ సంఘటనలో 11 మంది వ్యక్తులపై కాల్పులు జరుగగా ఒక కార్యకర్త మరణించాడు.