Ram Mandir : ఈ నెల 22న అయోధ్యలో జరగనున్న శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా ప్రారంభించనున్న ఈ రామమందిరానికి దేశ వ్యాప్తంగా అపూర్వమైన రీతిలో విరాళాలు అందాయి. పేద, మధ్యతరగతి కుటుంబాలు అనే తేడా లేకుండా అందరూ వెబ్‌సైట్‌తో పాటు సబ్స్క్రిప్షన్ల ద్వారా తమకు తోచినంతలో సహకరించారు.
ఈ సందర్భంగా రామభక్తులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. విరాళాల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త మోసానికి పాల్పడ్డారు. ఆలయ నిర్మాణానికి విరాళాలు ఇవ్వాలని సోషల్ మీడియాలో క్యూఆర్ కోడ్ పెట్టి దోచుకుంటున్నారని అధికారుల దృష్టికి వచ్చింది. వివిధ నంబర్ల నుంచి కాల్స్ చేస్తూ వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపుతున్నారు. తాజాగా ఇలా దోచుకుంటున్న కొందరు సైబర్ నేరగాళ్లను పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విరాళాలు ఇచ్చే ముందు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.