»Massive Explosion In Thailand S Firecracker Factory 20 People Killed Death Toll May Increase
Thailand : థాయిలాండ్ బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 18 మంది మృతి
థాయ్‌లాండ్‌లోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ భారీ పేలుడు కారణంగా 20 మంది మరణించినట్లు సమాచారం. సెంట్రల్ థాయ్‌లాండ్‌లోని బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిందని రెస్క్యూ వర్కర్ చెప్పారు.
Delhi-Darbhanga Superfast Express fire accident at etawah uttar pradesh
Thailand : థాయ్‌లాండ్‌లోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ భారీ పేలుడు కారణంగా 20 మంది మరణించినట్లు సమాచారం. సెంట్రల్ థాయ్‌లాండ్‌లోని బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిందని రెస్క్యూ వర్కర్ చెప్పారు. ఈ పేలుడులో కనీసం 20 మంది మరణించారు. ఈ మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సుఫాన్ బురి ప్రావిన్స్‌లోని స్థానిక రెస్క్యూ వర్కర్లు ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేశారు. ఫ్యాక్టరీ పూర్తిగా ధ్వంసమైనట్లు కనిపిస్తోంది.
గతేడాది జూలైలో కూడా థాయ్‌లాండ్‌లోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 9 మంది మృతి చెందగా, 115 మందికి పైగా గాయపడ్డారు. నరథివాస్ ప్రావిన్స్‌లోని సుంగై కొలోక్ నగరంలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ పేలుడు గురించి అప్పటి నగర గవర్నర్ సనన్ పొంగక్సోర్న్ మీడియాతో మాట్లాడుతూ, 115 మంది గాయపడ్డారని, వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఆ సమయంలో కూడా యుద్ధప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు చేపట్టారు.
పేలుడుకు సంబంధించి గవర్నర్ మాట్లాడుతూ.. విచారణ జరిపినప్పుడు స్టీల్ వెల్డింగ్ సమయంలో మంటలు చెలరేగడంతో బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించినట్లు ప్రాథమికంగా తేలిందని చెప్పారు. పేలుడు తర్వాత, మీడియాలో వైరల్ ఫుటేజ్‌లో మార్కెట్ నుండి పెద్ద ఎత్తున పొగలు రావడం కనిపించింది. పేలుడు ధాటికి పలు దుకాణాలు, ఇళ్లు, వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ సమయంలో పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పొగలు కమ్ముకున్నాయి.