పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న ఎమర్జెన్సీ గురించి ప్రసంగించారు. అయితే ఆమె ప్రసంగం చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తాజాగా స్పందించారు.
Sashi Tharoor: పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న ఎమర్జెన్సీ గురించి ప్రసంగించారు. ఇందిరాగాంధీ ప్రభుత్వంలో విధించిన ఎమర్జెన్సీ దేశంలో పెద్ద చీకటి అధ్యాయమని, రాజ్యాంగంపై ప్రత్యక్ష దాడి అని ప్రసంగించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తాజాగా స్పందించారు. ఎమర్జెన్సీ విధించడం అప్రజాస్వామికం కావచ్చేమో కానీ, రాజ్యాంగ విరుద్ధం మాత్రం కాదన్నారు. ఎమర్జెన్సీ సమయంలో జరిగిన ప్రభుత్వ చర్యలను మాత్రం అతను ఖండించారు. తాను కూడా ఎమర్జెన్సీని విమర్శిస్తానని.. సమర్థించడం లేదన్నారు.
ఎమర్జెన్సీ సమయంలో ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం, మీడియాపై ఆంక్షలు విధించడం ప్రజాస్వామ్య వ్యతిరేకమన్నారు. ప్రస్తుతం ప్రజల దృష్టి అసలు సమస్యలపై నుంచి మళ్లించేందుకు బీజేపీ ఎమర్జెన్సీ పేరుతో ప్రయత్నాలు చేస్తుందని శశిథరూర్ అన్నారు. ఏళ్ల కిందట జరిగిన ఘటనను బీజేపీ ఎందుకు మళ్లీ మాట్లాడుతుందోని అతను ప్రశ్నించారు. ఎమర్జెన్సీపైన పెట్టే దృష్టి ప్రజల సమస్యలపై పెట్టాలని ఎన్డీయేకు సూచన ఇచ్చింది.