»Up Man Dies After Taking Up Challenge To Drink Three Quarters Of Desi Liquor In 10 Minutes
Latest News : 10నిమిషాల్లో మద్యం తాగాలని పోటీ… వ్యక్తి మృతి…!
Latest News : మద్యం తాగడం విషయంలో పోటీ పెట్టుకొని ఓ వ్యక్తి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పూర్తివివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్ కి చెందిన 45ఏళ్ల జై సింగ్ అనే వ్యక్తి తన ఇద్దరు స్నేహితులతో ఛాలెంజ్ పెట్టుకున్నాడు. కేవలం 10 నిమిషాల్లో లోకల్ మందును మూడు క్వార్టర్లు తాగాలంటూ ఛాలెంజ్ చేశారు. తాగకపోతే... ఆరోజు వారు తాగిన మందు బిల్లు అంతా కట్టాలని వారు బెట్ వేసుకున్నారు. ఆ ఛాలెంజ్ లో గెలవాలని అతను మూడు క్వార్టర్లు తాగేశాడు. అయితే.. ఆ మందు బెడిసి కొట్టేసింది. అతనికి విషమంగా మారి అక్కడికక్కడే పడిపోయాడు. అతను ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో... అతని 16ఏళ్ల కుమారుడు వెతకడం మొదలుపెట్టాడు. కాగా... అతనికి తండ్రి అపస్మారక స్థితిలో పడిపోయి కనిపించాడు.
మద్యం తాగడం విషయంలో పోటీ పెట్టుకొని ఓ వ్యక్తి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పూర్తివివరాల్లోకి వెళితే… ఉత్తరప్రదేశ్ కి చెందిన 45ఏళ్ల జై సింగ్ అనే వ్యక్తి తన ఇద్దరు స్నేహితులతో ఛాలెంజ్ పెట్టుకున్నాడు. కేవలం 10 నిమిషాల్లో లోకల్ మందును మూడు క్వార్టర్లు తాగాలంటూ ఛాలెంజ్ చేశారు. తాగకపోతే… ఆరోజు వారు తాగిన మందు బిల్లు అంతా కట్టాలని వారు బెట్ వేసుకున్నారు. ఆ ఛాలెంజ్ లో గెలవాలని అతను మూడు క్వార్టర్లు తాగేశాడు. అయితే.. ఆ మందు బెడిసి కొట్టేసింది. అతనికి విషమంగా మారి అక్కడికక్కడే పడిపోయాడు. అతను ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో… అతని 16ఏళ్ల కుమారుడు వెతకడం మొదలుపెట్టాడు. కాగా… అతనికి తండ్రి అపస్మారక స్థితిలో పడిపోయి కనిపించాడు.
బాలుడు వెంటనే తండ్రిని సమీపంలోని రెండు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు, కానీ రెండు ఆరోగ్య సౌకర్యాలు చికిత్స అందించడానికి నిరాకరించాయి. అనంతరం ఎస్ఎన్ మెడికల్ కాలేజీలో చేర్పించుకోగా… అప్పటికే అతను మృతి చెందినట్లు ప్రకటించారు. మద్యం అతిగా తాగడం వల్లనే అతను చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
అతిగా మందు తాగడానికి అతనిని రెచ్చ గొట్టిన ఇద్దరు స్నేహితులైన భోలా, కేశవ్‌లపై ఐపీసీ సెక్షన్ 304 (అపరాధపూరితమైన హత్య) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో బహదూర్ సింగ్ మాట్లాడుతూ, “భోలా , కేశవ్‌లను అరెస్టు చేసి జైలుకు పంపాం. విచారణలో, జైతో పాటు తాము ఫిబ్రవరి 8న శిల్పగ్రామ్ పార్కింగ్ సమీపంలో మద్యం తాగేందుకు వెళ్లినట్లు నిందితులు అంగీకరించారు.”అని చెప్పారు.
జై సింగ్ కి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె సహా నలుగురు మైనర్ పిల్లలు ఉన్నారు.కాగా… జై సింగ్ మరణంతో వారి కుటుంబం చిన్నాభిన్నమైంది. మద్యం తమ కుటుంబాన్ని నాశనం చేసిందని వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.