»Team Indias New Record Top Ranking In All Formats
Team India: సరికొత్త రికార్డు.. అన్ని ఫార్మాట్లలో టాప్ ర్యాంకింగ్
ఇండియా పురుషుల క్రికెట్ జట్టు అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. తాజాగా ICC టెస్ట్ ర్యాంకింగ్స్ లలో మెన్స్ టీమిండియా జట్టు అన్ని ఫార్మాట్లలో ఐసీసీ వరల్డ్ నంబర్ వన్ జట్టుగా నిలిచింది.
టీమిండియా సరికొత్త రికార్డు సృష్టించింది. తాజాగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) టెస్ట్ ర్యాంకింగ్స్ లో భారత పురుషుల క్రికెట్ జట్టు మూడు ఫార్మాట్లలో ICC వరల్డ్ నంబర్ 1 జట్టుగా నిలిచింది. మెన్ ఇన్ బ్లూ(men in blue) ఇప్పటికే ICC ODI, T20I ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాల్లో ఉండగా.. ఇటీవల బోర్డర్ గావస్కర్ ట్రోఫీ(border gavaskar trophy)లో భాగంగా మొదటి టెస్ట్‌లో ఆస్ట్రేలియా(australia)పై టీమిండియా(team india) భారీ విజయం సాధించిన క్రమంలో టెస్ట్ ర్యాంకింగ్స్‌లో కూడా నంబర్ వన్ స్థానానికి ఎగబాకింది. భారత జట్టు ఇలాంటి ఘనత సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. 2014లో దక్షిణాఫ్రికా కూడా ఇది రికార్డును సాధించిన తర్వాత ఇది రెండవది. మెన్ ఇన్ బ్లూ అటువంటి ఘనతను నమోదు చేసిన మొదటి ఆసియా జట్టుగా అవతరించింది.
తాజా ICC ర్యాంకింగ్స్ ప్రకారం టెస్టుల్లో టీమిండియా(team india) 32 మ్యాచులు గెలిచి 3,690 పాయింట్లు సాధించి 115 రేటింగ్ తో అగ్రస్థానంలో నిలించింది. రెండో స్థానంలో ఉన్న ఆసీస్(australia) కంటే ఇండియా 4 పాయింట్లు ముందుంది. ప్రస్తుతం ఇంగ్లండ్(england) 106 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ODI గేమ్ లలో మెన్స్ ఇండియా జట్టు 44 మ్యాచులు గెలిచి, 5010 పాయింట్స్ సాధించి 114 రేటింగ్ తో టాప్ నిలిచింది. ఇక టీ20లో 69 మ్యాచుల్లో విజయం సాధించి 18,445 పాయింట్స్ సాధించి 267 రేటింగ్ తో మొదటి స్థానంలో నిలిచింది. మొత్తంగా అన్ని ఫార్మాట్లలో పురుషుల భారత్(team india) జట్టు అగ్రస్థానానికి చేరుకుంది.
అశ్విన్(ashwin) బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకోగా, జడేజా(jadeja) ర్యాంకింగ్స్‌లో మరింత ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. ఇద్దరు స్పిన్నర్లు కలిసి ఏకంగా 15 వికెట్లు పడగొట్టి ఆసీస్ బ్యాట్స్ మెన్ ను కట్టడి చేశారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ICC ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. అశ్విన్ అతని కంటే 21 రేటింగ్ పాయింట్ల వెనుక ఉన్నాడు. ఇంకోవైపు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ(border gavaskar trophy)లో భాగంగా శుక్రవారం ఢిల్లీ(delhi) వేదికగా ఆస్ట్రేలియా(australia team)తో రెండో టెస్టు జరగనుంది.